file

భాద్రపద చతుర్థి తేదీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ  రోజు గణేష్ చతుర్థి  లేదా వినాయక చవితి జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, ఈసారి చతుర్థి తిథి సెప్టెంబర్ 18 మధ్యాహ్నం 12:39 గంటలకు వస్తుంది. చతుర్థి సాయంత్రం పడుతున్నందున, సెప్టెంబర్ 18న  వినాయక చతుర్థి పండుగను జరుపుకుంటారు. చతుర్థి తిథి 19న ప్రారంభమై మధ్యాహ్నం 1:43 వరకు ఉంటుంది. ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది.

వినాయక చవితి రోజు కింద పేర్కొన్న మంత్రం చదివితే మీకు సకల కష్టాలు పోయి సంపద మీ సొంతం అవుతుంది. ఆ స్తోత్రం ఏంటో చూద్దాం.

సంకట నాశన గణేశ స్తోత్రమ్

ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్,

భక్తావాసం స్మరేన్నిత్యం, అయు: కామార్థసిద్ధయే.

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్,

తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ,

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టమమ్.

నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకమ్,

ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...