Wednesday Pooja: బుధవారం గణపతిని ఎలా పూజించాలో తెలుసుకోండి, కుటుంబం కష్టాల్లో ఉందా, అప్పుల బాధ తీరడం లేదా, అనారోగ్యం వేధిస్తోందా..ప్రతీ బుధవారం ఈ పని చేయండి...
Representational Image (Photo Credits: Screengrab/ YouTube)

వారంలో బుధవారం కూడా గణపతికి అంకితం చేశారు. జ్ఞానాన్ని ఇచ్చే గణేశుడికి బుధవారం ప్రీతికరమైనదిగా పేర్కొంటారు. ఈ రోజున గణపతిని ప్రత్యేకంగా పూజిస్తారు. గణపతిని శాస్త్రాలలో మొదట పూజలు అందుకేనే వాడిగా.. విఘ్నాలను తొలగించి.. ప్రయోజనాలు చేకూర్చే దేవుడిగా అభివర్ణించారు. అందుకే ఆ గణేషుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, దానికి పరిష్కారం దొరకని పక్షంలో, బుధవారం నాడు గణపతిని పూజించడమే కాకుండా, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి. అలా చేయడం ద్వారా ఎంతపెద్ద సమస్య నుంచి అయినా బయటపడుతారట.

ఇంటర్వ్యూలో విజయం కోసం..

మీరు ఏదైనా నిర్దిష్ట పనిలో విజయం సాధించాలనుకుంటే ప్రతి బుధవారం గణపతిని పూజించండి. గణపతి అథర్వశీర్షాన్ని పఠించండి. దీంతో మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారు.

కుటుంబ కష్టాల నుండి బయటపడటానికి..

మీ జీవితంలో కష్టాల పరంపర కొనసాగుతున్నట్లయితే.. ఆ కష్టాల నుంచి బయటపడేందుకు ప్రతి బుధవారం గణపతికి 21 గరకపోచలను సమర్పించండి. దీంతో, మీ జీవితంలోని ప్రతి సంక్షోభం క్రమంగా తొలగిపోతుంది.

ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ..

ఇంట్లో ఆర్థిక సమస్యలు వేధిస్తున్నట్లయితే.. బుధవారం పచ్చని పెసళ్లను దానం చేయండి. ఇది కాకుండా, పెసళ్లను నీటిలో మరిగించి, నెయ్యి మరియు పంచదార కలిపి ఆవుకు తినిపించండి. దీని వల్ల కుటుంబ పురోభివృద్ధి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి..

మిమ్మల్ని అనారోగ్య సమస్యలు వేధిస్తున్నట్లయితే..ప్రతి బుధవారం నాడు ఏదైనా అవసరం ఉన్నవారికి పెసళ్లను దానం చేయండి.