Rama-Navami-2022-Wishes-in-Telugu_8

ఈ సంవత్సరం రామ నవమి ముహూర్తం ఏప్రిల్ 10వ తేదీ తెల్లవారుజామున 1:32 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ముగుస్తుంది. అయితే నిజానికి చైత్ర మాసంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ నవరాత్రులు జరుపుకుంటారు.వీటిని చైత్ర నవరాత్రులు అంటారు. రేపటితో ఈ చైత్ర నవరాత్రులు ముగుస్తాయి. శ్రీరామ నవమి రోజు ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.

1. మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

2. ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం మంచిది కాదు. వీలైతే ఇవి లేకుండా వంటలు వండాలి.

3. నవరాత్రి రోజులలో జుట్టును కత్తిరించుకోవద్దు. షేవింగ్ చేసుకోవద్దు.

4. సాత్విక జీవనశైలిని గడపడానికి ప్రయత్నించండి.

5. పూజ సమయంలో ఎవరైనా ఎలాంటి బెల్ట్, చెప్పులు-బూట్లు లేదా తోలుతో చేసిన వస్తువులను ధరించకూడదు.

6. ఈ రోజు ఎవరిని బాధపెట్టవద్దు, ఎవరితోనూ అబద్దం చెప్పొద్దు.

7. ఈ రోజు శారీరక సంబంధాలు మానుకోండి.