శ్రావణమాసం ప్రారంభం అయిపోయింది. ఈనెల అంటే ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం వైభవంగా మహిళలందరూ జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతం పండగ మహిళలకు ఒక రకంగా చెప్పాలంటే తమ కుటుంబానికి, తమ భర్తకు వరాలను ఇవ్వమని లక్ష్మీదేవిని కోరుకునే వ్రతమే ఈ వ్రతం. ముఖ్యంగా పెళ్లి అయినా మహిళలు ఈ వ్రతం ఆచరిస్తారు. కొత్తగా పెళ్లయిన వారు కూడా ఎక్కువగా ఈ వ్రతం ఆచరిస్తారు ఎందుకంటే తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని వరలక్ష్మి దేవిని కోరుకుంటారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 25వ తేదీన వచ్చింది. ప్రతి సంవత్సరం రెండవ శ్రావణ శుక్రవారం ఈ వ్రతం ఆచరిస్తారు.
శ్రావణ వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయాన్నే లేచి మహిళలు తలస్నానం చేసి వరలక్ష్మి దేవి రూపం ప్రతిష్టిస్తారు. అలాగే కలశం కూడా ప్రతిష్టిస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదువులను పిలిచి పేరంటం నిర్వహిస్తారు. వారందరికీ తాంబూలం అందించి ఆశీర్వచనం పొందుతారు. కన్న పిల్లలను పిలిచి వారికి భోజనం పెడతారు. శ్రావణమాసం అంటేనే పండగల మాసం. ఈ మాసంలోనే మహాలక్ష్మి భూమ్మీద కొలువై ఉంటుందని పేరుంది. కనుక మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలంటే వరలక్ష్మీదేవికి వ్రతం చేయడం ద్వారా మీరు అన్ని రకాల బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...
ఇక శ్రావణమాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం చేయలేని వారు. మూడవ, నాల్గవ శుక్రవారం కూడా వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించవచ్చు. వరలక్ష్మి దేవి వ్రతం రోజు ఉదయం పూట ఉపవాసం ఉండి సాయంకాలం నైవేద్యం పెట్టిన తర్వాత హారతి అనంతరం పలహారం తీసుకోవాలి. అలాగే ఈరోజు ఆవులకు అరటి పళ్ళు, ఉడికించిన అన్నము పెట్టడం ద్వారా మరింత పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.