Yogeshwara Dwadashi: కార్తీక ద్వాదశి ఎప్పుడు జరుపుకోవాలి, ఈ పూజ చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే తిష్ట వేస్తుంది, కోటీశ్వరులు అయ్యే అవకాశం..

నవంబర్ 5న కార్తీక శుద్ధ ద్వాదశి పండగ హిందువులు నిర్వహించనున్నారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. దీనినే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగేశ్వర ద్వాదశి అంటారు.

Yogeshwara Dwadashi: కార్తీక ద్వాదశి ఎప్పుడు జరుపుకోవాలి, ఈ పూజ చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే తిష్ట వేస్తుంది, కోటీశ్వరులు అయ్యే అవకాశం..
(Rep. Image)

నవంబర్ 5న కార్తీక శుద్ధ ద్వాదశి పండగ హిందువులు నిర్వహించనున్నారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు.  దీనినే క్షీరాబ్ది ద్వాదశి,  చిలుకు ద్వాదశి,  యోగేశ్వర ద్వాదశి అంటారు. 

కార్తీక శుద్ధ ద్వాదశీ శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన వ్రతం. ఈ రోజున ఆవును దూడతో సహా బ్రాహ్మణునికి దానమిస్తే స్వర్గసుఖాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.   

కార్తీకశుద్ధ ద్వాదశి రోజు బ్రాహ్మణులకు  దానమిస్తే ఇహపర సుఖములు పొందుతారు . ఈ రోజున తులసి చెట్టుగాని , సాలగ్రామాన్ని గాని బ్రాహ్మణుని కి దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది . ఈ కార్తీక శుద్ధ ద్వాదశినే  " ఉత్దాన ద్వాదశి " అంటారు 

కార్తీక ద్వాదశి రోజు తులసి  మొక్కకు,  ఉసిరి చెట్టు కు పెళ్లి చేస్తారు.  ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి వారి ఇంట్లోనే కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం.  అలాగేశక్తి కొలది దీపాలను ఇంటి ముందు వెలిగించాలి.  ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు అని రాసి ఉంది. ఆ తరువాతి రోజే ద్వాదశీ. 

అత్యాచార బాధితురాలిపై టూ ఫింగర్‌ టెస్ట్‌‌పై మండిపడిన సుప్రీంకోర్టు, తక్షణమే ఈ విధానం నిలిపివేసేలా చూడాలని కేంద్రానికి ఆదేశాలు

చిలుకు ద్వాదశి రోజు ఏం చేయాలి..

 ఈరోజు ఉదయాన్నే లేచి నదికి వెళ్లి స్నానం చేయాలి.  నదికి వెళ్ళలేని వారు. గంగా జలం నీటిలో  కలుపుకొని స్నానం చేస్తే కూడా అంతే పుణ్యం వస్తుంది.  ఈ రోజు తులసి మొక్క, పక్కన  ఉసిరి చెట్టు కాడను జత చేసి పెళ్లి చేయాలి. అప్పుడు మీ ఇంట్లోనే లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని ప్రతీతి. తులసి మొక్కలో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. 

(The above story first appeared on LatestLY on Nov 01, 2022 05:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).