చలికాలంలో వేడివేడిగా సాయంత్రం పూట స్నాక్ తినాలని అనిపిస్తుంది. అయితే వంకాయ తోటి నోరూరించే వంకాయ బజ్జి ట్రై చేస్తే హాయిగా లొట్టలేసుకుంటూ తినొచ్చు. ఇది ఈ చలికాలంలో సాయంత్రం పూట వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు పెద్దలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీగా సింపుల్ గా చేసుకోదగ్గ రెసిపీ అయితే దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ నోరూరించే వంకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు.
శనగపిండి- పావు కేజీ
ఉప్పు - తగినంత
చిటికెడు- వంట సోడా
బియ్యప్పిండి -పావు కప్పు.
మసాలా కోసం..
ఉల్లిపాయ- రెండు
కారం రెండు -టీ స్పూన్లు
జీలకర్ర- ఒక టీ స్పూన్
ఉప్పు- రుచికి తగినంత
చింతపండు- కొంచెం
నిమ్మరసం -రెండు స్పూన్లు
వంకాయలు- అరకేజీ
ఆయిల్ -డీప్ ఫ్రై కి సరిపడినంతగా
తయారీ విధానం.. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో సెనగపిండి, ఉప్పు, వంట సోడా బియ్యప్పిండి, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడుదానిలో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి. బజ్జి వేయడానికి అనువుగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. వంకాయకు పట్టే విధంగా ఉంటే సరిపోతుంది. పిండిని మరీ లూజ్ గా కూడా కలుపుకోకూడదు .అదేవిధంగా మరి గట్టిగా కూడా ఉండకూడదు. పిండిని ఎంత మంచిగా కలిపితే బజ్జీలు అంతా గుల్లగా క్రిస్పీగా వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిక్కులో అద్దం పెడితే, అశుభం
మసాలా కోసం- ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు కారం, జీలకర్ర ఉప్పు చింతపండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని గట్టిముద్దగానే పక్కకు పెట్టుకోవాలి. నీరు పోయకుండా కేవలం ఉల్లిపాయ నీటితోనే మిక్సీ చేసుకుంటే మంచిది. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దకి కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలను తీసుకొని బాగా కడిగి శుభ్రంగా తుడుచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు వేసి ఉప్పు వేసి ఉంచాలి. వంకాయలను పొడుగ్గా ఘాటు పెట్టుకొని పుచ్చులు లేకుండా చెక్ చేసుకొని కట్ చేసుకుని నీళ్లలో వేయాలి. ఇప్పుడు వంకాయలను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేయాలి. ఇలా ముక్కలు చేసుకున్న వంకాయలను 50% ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా వంకాయల స్టఫ్ లాగా చేసుకోవాలి. అలాగా అన్ని వంకాయలలో ఈ స్టఫ్ ని పెట్టి రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను సెనగపిండిలో ముంచి ఒక్కొక్కటి నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు వంకాయల బజ్జీలు రెడీ అయిన తర్వాత వాటిని మధ్యలో కట్ చేసుకుని ఉల్లిపాయలను స్టఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని జల్లుకొని తింటే చాలా అద్భుతమైన రుచి కలిగిన వంకాయ బజ్జీ రెడీ దీన్ని ఈ చలికాలంలో సాయంత్రం పూట స్నాక్స్ గా తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలకు పెద్దలకు చాలా బాగా నచ్చుతుంది.