Bird Flu: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ వ్యాధి భయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఈ దెబ్బతో ప్రతి ఒక్కరు చికెన్ కోడిగుడ్లు తినడం మానేస్తున్నారు. మార్కెట్లో కూడా కేజీ చికెన్ ధర 100 రూపాయలకు పడిపోయింది. కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాకపోయినప్పటికీ, సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కేసులు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీంతో తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి కోడిగుడ్లు చికెన్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినప్పటికీ బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ వండుకోవాల్సిన పద్ధతుల గురించి తెలుసుకుందాం.

చికెన్‌ను సురక్షితంగా వండుకోవటానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవే..

బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్‌ను సరిగ్గా వండటం చాలా ముఖ్యం:

- చికెన్ టెంపరేచర్ కనీసం 75 సెంటీగ్రేడ్ వరకూ ఉండాలి. చికెన్ ను చాలా ఎక్కువ అరగంటసేపు ఉప్పు నీటిలో ఉడికించాలి

- చికెన్ మాంసం లోపల పింక్ రంగు లేకుండా పూర్తిగా తెలుపు రంగులోకి మారాలి

- కాల్చిన చికెన్ చాలా సురక్షితం

- వంట వండే సమయంలో పచ్చి చికెన్ ముట్టుకున్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.

Health Tips: పాలతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహారాలను తీసుకోకూడదు ...

- చికెన్‌ను ఫ్రిజ్‌లో 4 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత లోపు ఉంచాలి

- వండిన చికెన్‌ను వెంటనే తినకపోతే ఫ్రిజ్‌లో పెట్టాలి

- చికెన్‌ను బాగా కడిగి శుభ్రం చేయాలి

- చికెన్ ఉడికించడానికి కుక్కర్ అయితే సరిగ్గా సరిపోతుంది. నాలుగు నుంచి ఆరు విజిల్స్ వచ్చేవరకు చికెన్ ఉడికిస్తే అందులో బ్యాక్టీరియా చనిపోతుంది.

- గట్టిగా ఉన్న చికెన్‌ను ఫ్రిజ్‌లో కాకుండా రూమ్ టెంపరేచర్‌లో కరిగేలా చేయాలి

- చికెన్‌ను పూర్తిగా ఉడికేవరకు వండాలి

- మధ్యలో కత్తితో కోసి చూసి మాంసం రంగు తెలుపుగా మారిందో లేదో చెక్ చేసుకోవాలి

- వేడి నూనెలో చికెన్ వేయించినప్పుడు అందులో బ్యాక్టీరియా

ఈ జాగ్రత్తలు పాటిస్తే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకే ప్రమాదం చాలా తక్కువ.చనిపోతుంది