Health Benefits of Drumstick: ప్రకృతి సంపదలో మునగాకు ఒకటి. ఇక మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య యోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి.ఇక ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు.
మునగాకుల్లో (Moringa Leaves) విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఎక్కువ. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎని పది రెట్లు అధికంగా మునగాకు (Health Benefits of Drumstick) ద్వారా పొందొచ్చు.కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును వాడతారు.పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా, పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి (Moringa benefits for men) పొందవచ్చు.అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.
మునగాకు, మునగ పూలు, మునగ కాయలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు (Unbelievable benefits of drumsticks) చేస్తాయి. వీటితో పాటు మునగ బెరడు, వేర్లు ఇలా ప్రతి భాగాన్ని అనేక వ్యాధులకు ఔషధాలుగా వినియోగిస్తారు. మునగాకు, వసకొమ్ము, వాము సమంగా కలిపి దంచి నూనెలో ఉడకబెట్టి గాయాలకు, దెబ్బలకు కడితే మానుతాయి.మునగాకును దంచి తీసిన రసం పిల్లల వయసును బట్టి ఐదారు చుక్కల్లో చిటికెడు ఉప్పు కలిపి తాగిస్తే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.
లేత మునగ ఆకు కూర వండుకుని తింటుంటే పురుషులకు శక్తినిస్తుంది. సుఖ విరేచనం కలగాలంటే మునగాకు తింటుండాలి. మునగ కాయలు, ఆకులు కూరగా చేసుకుని తింటే స్త్రీలకు శరీరంలో చెడునీరు తొలగుతుంది. బాలింతలకు తల్లిపాలు పెంచే గుణం మునగకు వుంది. మునగాకు రసం నేత్ర రోగాలను, వాత, పైత్య దోషాలను, విషాలను హరిస్తుంది.
కలలో ఇవి కనిపిస్తే మీరు ధనవంతులు అవుతున్నారని శుభ సూచకం, అదృష్ట జాతకం మిమ్మల్ని వదిలి పొమ్మన్నా పోదు
మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు.
గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.
ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలు.. నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రా, ఫ్యాట్స్ 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రా, కాల్షియం 440 మిల్లీ గ్రా, పాస్పరస్ 70 మిల్లీ గ్రా, ఐరన్ 7 మిల్లీ గ్రా, 'సి’ విటమిన్ 200 మి .గ్రా, ఖనిజ లవణాలు 2.3 శాతం,పీచు పదార్థం 0.9 మి గ్రా,ఎనర్జీ 97 కేలరీలు ఉంటాయి.
మునగ కాయలు, పచ్చి మామిడి కాయలు కలిపి వండిన కూర తింటే వేసవిలో శరీరానికి చలవ చేకూరటయే గాక మన దేహము నందలి ఐరన్, విటమిన్ 'సి' లోపించకుండా ఉంటాయి. అలాగే మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తాగుచున్న తాత్కాలిక నపుంసకత్వం తగ్గుతుంది. ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధముగా పనిచేస్తుంది. మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరి నీటిలో ఒక చెంచా మునగ పువ్వుల రసము కలిపి తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి.
మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాస్తే వ్యాధులు నయమవుతాయి. మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలకు, బెణుకు నొప్పుల పైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గుతాయి. మునగాకు రసములో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా మారుతుంది. ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి తగ్గిపోతుంది.