Anthrax Pneumonia (Photo Credits: Pexels)

Warangal, Oct 29: తెలంగాణలో ఆంత్రాక్స్ వ్యాధి (Anthrax Disease) కలకలం రేపుతోంది. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్‌ వ్యాధితో మృతి చెందడంతో పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది గొర్రెలు, మేకలకు టీకాలు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా ప్రజలు మాత్రం ఆందోళన చెందుతూ ఉన్నారు.

సాంబయ్య అనే వ్యక్తి పెంచుకునే గొర్రెల మందలో ఇటీవల కొన్ని రోజులుగా మందలో రోజుకొక గొర్రె చొప్పున (Sheep dead with Anthrax symptoms) చనిపోయాయి. దీంతో ఆందోళన చెందిన సాంబయ్య తొగడరాయి పశువైద్యాధికారిదృష్టికి తీసుకెళ్లారు. దీంతో డాక్టర్ శారత చనిపోయిన గొర్రెల శాంపిల్స్ సేకరించి ఆ శాంపిల్స్‌ను పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని పశువుల ప్రధాన ఆసుపత్రి ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించి వచ్చిన పరీక్షల రిపోర్టులో గొర్రెలకు ఆంత్రాక్స్ (Anthrax in Telangana) సోకినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో గొర్రెల కాపరులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

ఆంత్రాక్స్ గొర్రెల నుంచి మనుషులకు సోకితే ప్రాణహానీ జరిగే అవకాశం వుంది. దీంతో గొర్రెల మందను గ్రామానికి దూరంగా వుంచాలని అధికారులు ఆయా గొర్రెల మందల యజమానులకు సూచించారు. కాగా ఈ ఆంత్రాక్స్ వ్యాధి పశువుల నుంచి పశువులకే కాకుండా పశువుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది. దీంతో స్థానికులే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

డేంజర్‌గా మారుతున్న డెంగ్యూ, పెరుగుతున్న కేసులు, డెంగ్యూ ఎలా వస్తుంది, నివారణ చర్యలు ఏంటీ, ప్లేట్‌లెట్ల స్థాయిని పెంచే ఆహారపదార్థాలు ఏంటో ఓ సారి చూద్దాం

ఆంత్రాక్స్ వ్యాధి శాఖాహార పశువుల్లో వస్తుంది. అంటే మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటివాటిలో వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బారినపడి పశువులను తాకితే మనషులకు కూడా ఇది సోకుతుంది. అంత్రాక్స్ న్యుమోనియా కేసులలో 95 శాతం శరీరం తాకడం వల్ల వ్యాప్తిచెందుతుంది. చర్మంపై బొబ్బలు, దద్దుర్లకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఆంత్రాక్స్ న్యుమోనియా.. బాసిల్లస్ ఆంత్రాసిస్‌ అనే బ్యాక్టిరియా ద్వారా సోకుతుంది.

సాధారణంగా కలుషితమైన ఆహారం, మాంసం తినేటప్పుడు ఆంత్రాక్స్ వ్యాపిస్తుంది..ఈ వ్యాధి సోకింది అనటానికి వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నేరుగా మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సోకినా.. ఫ్లూ, కోవిడ్ మాదిరి అంత వేగంగా వ్యాప్తిచెందదు. కానీ జాగ్రత్తలు చాలా చాలా అవసరం. బాసిల్లస్ ఆంత్రాసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు మూడు రోజుల్లోనే బయటపడతాయి. కానీ, కొన్ని కేసుల్లో రెండు నెలల వరకూ లక్షణాలు బయటకు కనిపించవు. ఈ వ్యాధిని యాంటీబయాటిక్స్‌తో నయం చేయొచ్చు. కానీ, వ్యాధి లక్షణాలు కనిపించగానే ఎంత తొందరగా చికిత్స ప్రారంభిస్తే అంత మంచిది. ఆలస్యం చేస్తే, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది.

కరోనా మాటున మరో మృత్యుఘోష, టీబీ వ్యాధితో గతేడాది కోటిన్నర మందికి పైగా మృతి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో వివరాలు

మేక లేదా గొర్రె మాంసం కొనేముందు వాటిని పశువైద్యులు తనిఖీ చేశారో? లేదో నిర్ధారించుకోవాలని, వ్యాపారులు చెప్పింది నమ్మశక్యంగా లేకపోతే జీవాలను కోసిన ప్రాంతాన్ని ఒకసారి పరిశీలించాలని పశు సంవర్థక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీవాలను కోసినప్పుడు వెలువడే రక్తం వెంటనే గడ్డకట్టకుండా ద్రవరూపంలోనే ఉంటే వాటికి ఆంత్రాక్స్‌ సోకినట్లు గుర్తించాలని చెబుతున్నారు. ఆంత్రాక్స్ సోకిన మేకలు, గొర్రెల మాంసాన్ని తినడం, తాకడం, అమ్మడం చేయొద్దని ప్రజలకు, గొర్రెల కాపరులకు, వ్యాపారులకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

ఆంత్రాక్స్‌ ఒకసారి ఒక ప్రాంతంలో వ్యాపిస్తే 60 ఏళ్ల పాటు ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అదనపు సంచాలకుడు డాక్టర్‌ రాంచందర్‌ చెబుతున్నారు. ఈ వ్యాధితో చనిపోయిన జీవాల కళేబరాలను జాగ్రత్తలు తీసుకోకుండా పూడిస్తే వాటి నుంచి సూక్ష్మక్రిములు బయటకు వచ్చి అక్కడి నేలలో ఏళ్ల తరబడి పాతుకుపోతాయి తెలిపారు. అందువల్ల అక్కడి నీరు, గడ్డి, గాలి ద్వారా చుట్టుపక్కల మనుషులకు, పశువులకు వ్యాధి వ్యాపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆంత్రాక్స్ ఆనవాళ్లు బయటపడిన నేపథ్యంలో మటన్ తినే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రోడ్ల పక్కన అమ్మే మాంసాన్ని తినొద్దని హెచ్చరిస్తున్నారు. కనీసం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా ఉడికించిన మాంసాన్నే తినాలని, సరిగా ఉడకకపోతే ఎట్టిపరిస్థితుల్లో తినొద్దని సూచిస్తున్నారు.

ప్రమాదకరంగా ఏవై.4.2 వేరియంట్, ప్రపంచ దేశాల్లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్, AY 4.2 తో మన దేశానికి తప్పని కోవిడ్ మూడవ దశ ముప్పు

వ్యాధి సోకిన పశువుల ముక్కు, మలమూత్రాల ద్వారా ఇది మనుషులకు సోకే అవకాశం ఉంటుందని చెప్పారు. మాంసం తినడం వల్ల వ్యాధి సోకే అవకాశాలు పెద్దగా ఉండవని పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వెటర్నరీ పబ్లిక్‌ హెల్త్‌ విభాగాధిపతి డాక్టర్‌ అన్మోల్‌ విజయ్‌ స్పష్టంచేశారు. ఆంథ్రాక్స్‌ బ్యాక్టీరియా సాధారణంగా అటవీ ప్రాంతాల్లో ఉంటుందని తెలిపారు. మాంసం తినడం వల్ల వ్యాధి సోకే అవకాశాలు పెద్దగా ఉండవని ఆయన స్పష్టంచేశారు.

ఆంత్రాక్స్‌ వ్యాధి మనుషుల్లో మూడు దశల్లో ఉంటుందని డాక్టర్‌ విజయ్‌ తెలిపారు. తొలిదశలో చర్మంపై ఎర్రటి బొబ్బులు వస్తాయి. రెండోదశలో వాంతులు, విరేచనాలు అవుతాయి. మూడోదశలో న్యూమోనియాలా ఊపిరితిత్తుల సమస్య ఎదురవుతుంది అని వివరించారు. గొర్రెలు, మేకలు, పశు మాంసాన్ని బల్దియా స్టాంప్‌ లేకుండా కొనుగోలు చేయరాదని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారి డాక్టర్‌ వకీల్‌సాబ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బల్దియా స్టాంప్‌ లేని మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని, అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రేటర్‌లోని అన్ని కబేళాల్లో పశువులకు వైద్యపరీక్షలు జరిపిన తర్వాతే వధించడం జరుగుతుందని స్పష్టంచేశారు.