TB Deaths: కరోనా మాటున మరో మృత్యుఘోష, టీబీ వ్యాధితో గతేడాది కోటిన్నర మందికి పైగా మృతి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో వివరాలు
World Health Organization (File Photo)

Geneva, Oct 15: కరోనా సంక్షోభం మరచిపోకముందే మరో వార్త ఆందోళన కలిగిస్తోంది. దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు (Tuberculosis deaths rise for the first time) ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక (WHO Report) వెల్లడించింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గురువారం విడుదలచేసిన గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

2020లో కోవిడ్‌ మహమ్మారి కారణంగా (due to the COVID-19 pandemic) క్షయ వ్యాధికి చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. మహమ్మారి మూలంగా అనేక మంది రోగులు కనీసం వ్యాధి నిర్ధారణకు కూడా నోచుకోలేదు. గణాంకాల ప్రకారం 2019లో 7.1 కోట్ల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 2020లో ఆ సంఖ్య 5.8 కోట్లకు పడిపోయింది. కొవిడ్‌ కారణంగా టీబీ నిర్ధారణ, చికిత్సలో ఆటంకం కలగడంతో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు WHO ఆందోళన వ్యక్తం చేసింది. టీబీ నివారణ, చికిత్సపై శ్రద్ధ చూపాలని ప్రపంచ దేశాలకు WHO పిలుపునిచ్చింది. కొవిడ్‌ విజృంభణ కారణంగా టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

తలనొప్పికి తక్షణం ఉపశమనం కలిగించే చిట్కాలు, మీరు తాత్కాలిక తలనొప్పితో బాధపడుతున్నట్లయితే వీటిని ఆచరించి చూడమంటున్న నిపుణులు

ప్రస్తుతం 28లక్షల మంది మాత్రమే ఈ చికిత్స పొందుతున్నారని.. అంతకుముందుతో పోలిస్తే 28శాతం తగ్గినట్లు WHO నివేదిక వెల్లడించింది. ప్రమాదకరమైన టీబీ పోరులో భాగంగా 2030 నాటికి 90శాతం మరణాలు, 80శాతం కేసులను తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లో లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటినుంచి 2020 నాటికి టీబీ మరణాల్లో దాదాపు 9శాతం, కేసుల్లో 11శాతం తగ్గుదల కనిపించింది. కానీ, ఊహించని రీతిలో విరుచుకుపడిన కొవిడ్‌ కారణంగా టీబీ నిర్మూలన ప్రణాళికకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు వేధిస్తున్నాయా, ఇంటిలోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని తరిమికొట్టవచ్చు, నిపుణులు చెబుతున్నవేంటో ఓ సారి చూద్దాం

గత యేడాది మనదేశంతో సహా దాదాపుగా 30 దేశాల్లో సమారు కోటిన్నర మంది (2,14,000 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులతో కలిపి) క్షయతో మరణించారని డబ్యూహెచ్‌వో తన నివేదికలో తెలియజేసింది. ఐతే 2021-22లో టీబీ మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ చేయడం, చికిత్స అందించడంలోని సవాళ్లను అధిగమిస్తే దీనినుంచి బయటపడొచ్చని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధుల కారణంగా అనారోగ్యంతో బాధపడేవారికి కోవిడ్‌ సమయంలో చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. దాని పర్యవసానమే ఈ మృత్యుఘోష అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.