హస్తప్రయోగం అనేది పురుషులు, స్త్రీలు తమ దైనందిన జీవితంలో చేసుకొనే ఒక సాధారణ కార్యకలాపం. హస్తప్రయోగంలో తమకు తాముగా వారి జననాంగాలను ప్రేరేపిపించుకుంటారు. ఇది శరీరంలో లైంగిక ఉద్రిక్తతను పెంపొందించడానికి, భావప్రాప్తిని (Orgasm) పొందడానికి, శృంగార సంతృప్తిని పొందడానికి ఒక మార్గం.
లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే హస్త ప్రయోగం వలన చాలా వెబ్సైట్లలో చాలా ఉపయోగాలున్నాయి అని చెప్పారు. ప్రముఖ వైద్యులు కూడా కొన్ని ఇంటర్యూలలో హస్త ప్రయోగం మంచిదే అని చెప్తూ ఉంటారు. కాని హస్త ప్రయోగం ఎక్కువ చేయడం వలన మనకి కొన్ని చెడు ప్రభావాలు కూడా కలుగుతాయి.
1 అతిగా పోర్న్ కి బానిస ఐపోవడం జరుగుతుంది. సోషల్ మీడియా, గూగుల్ లో ఎవరిని చూసినా పోర్న్ గుర్తుకు వస్తుంది. హీరో, హీరోయిన్లను ఎప్పుడూ తప్పుడు దృష్టితో చూస్తారు. వారిని చూస్తూ హస్త ప్రయోగం చేస్తూ ఉండటమే పనిగా పెట్టుకుంటారు.
2, హస్త ప్రయోగం వలన చాలా సమయం వృధా పోతుంది. కొంతమంది ఏమైనా పెద్ద పనులు చేసే ముందు హస్త ప్రయోగం చేస్తు ఉంటారు. ఉదాహరణకు ఇంటర్యూలకు వెళ్లేముందు, ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్లేముందు, స్నానానికి వెళ్లినపుడు హస్త ప్రయోగం చేసుకుంటుంటారు. ఇలా చేయడం వలన మనం చేయాల్సిన అసలు పని యొక్క సమయం దాటిపోతాము.
3. హస్త ప్రయోగాన్ని రోజువారి దినచర్య గా పెట్టుకున్న వాళ్ళని నేను చూసాను. వాళ్ళని గమనించాను. వారి మొహంలో కళ పోవడం, కళ్ళ కింద నల్లని వలయాలు రావడం, మంచి బరువుతో కాకుండా సన్నగా ఉండటం, ఏ పని చేయాలనే ఆలోచన లేక బద్ధకంగా ఉండటం లాంటి లక్షణాలు వారిలో ఉన్నాయి.
4. కొంతమంది పనీ పాటా లేకుండా ఎప్పుడూ హస్త ప్రయోగం బలవంతంగా రోజూ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో రకరకాల టెన్షన్లు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని కేసుల్లో ఇలాంటి వారికి జుట్టు రాలిపోయే సమస్యలు కూడా వస్తాయి.
4, హస్త ప్రయోగం పూర్తైన తర్వాత చాలా మంది గిల్టీ గా కూడా ఫీల్ అవుతారు. అది పూర్తైన వెంటనే ఎందుకు చేసామనో, వారి కులమతాల రూల్స్ ఆచారాలను పాటించకుండా ఇలా చేస్తున్నారనో ఇంకా వేరే కారణాలపరమైన గిల్ట్ భావన కలుగుతుంది. అలా ప్రతీసారి పెరిగి ఒక కొండలా ఏర్పడి హస్త ప్రయోగం చేసే మనిషి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ తీయచ్చు.
ఇలా హస్త ప్రయోగాన్ని ఎప్పుడో పది రోజులకో, నెలకో ఓసారి చేసే ఆరోగ్య ప్రక్రియగా కాక నెమ్మదిగా రోజూవారి చేసే చెడు అలవాటుగా మార్చుకుంటే, శారీరక ఆరోగ్యం గురించి పక్కనపెట్టండి, మానసికంగా చాలా చెడిపోతాం. తద్వారా సరైన సమయ పాలన లేక, ఎన్నో రకాలుగా అది మనపైన చెడు ప్రభావం చూపుతుంది. మన మెదడు కంట్రోల్ స్వభావాన్ని కోల్పోతుంది. దాని వలన కెరీర్ కూడా పాడైపోతుంది.