grey hair ( Image: File)

చాలా మందిని మానసికంగా వేధించే సమస్య తెల్లజట్టు. చిన్న వయసులోనే జుట్టు రంగు మారిపోవడంతో దాన్ని ఎలా కవర్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. ఇంతకుముందు వృద్దాప్యం లో ఉన్నవారికి మాత్రమే తెల్లవెంట్రుకలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం చూస్తున్నాం. దీంతో దాన్ని కవర్ చేసేందుకు ఏదంటా అది ఎయిర్ డైని వాడేస్తున్నారు. మరికొందరు అయితే జుట్టు నల్లగా ఉన్నప్పటికీ ఆ జుట్టు మరింత ఫ్యాషనబుల్ గా తయారు చేసుకోవడం కోసం రంగు వేసుకుంటున్నారు. అసలు మరి హెయిర్ డై వాడడం ఎంతవరకు మంచిదా.. కాదా..దీన్ని తరచుగా వాడితే క్యాన్సర్ వస్తుందన్న అపోహాలు ఉన్నాయి.. ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకుందామా..

హెయిర్ డైలో ఉండే కెమికల్స్ మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దీనివల్ల అలర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు వస్తుంటాయి. ఇలా ఎప్పుడైనా మీకు జరిగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

కొంతమంది అయితే హెయిర్ డై ప్యాక్ మీద అమోనియా ఫ్రీ అనే మాట చూసి అది సురక్షితమని వాడుతుంటారు. కానీ అందులో పీపీడీ అనే రసాయనం ఉంటుంది. ఆ రసాయనం లేనిదే వాడాలి. ఎందుకంటే అమోనియా ఫ్రీ అని ఉన్నప్పటికీ ఈ పీపీడీ కూడా అమోనియా నుంచి వచ్చే రసాయనమే కాబట్టి అమోనియా ఫ్రీ అనే విషయంలోనూ చాలా జాగ్రత్త పడి వాడాలి.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, 

హెయిర్ డై వాడేవారు అది మనకు సరిపడుతుందా లేదా అన్నది గమనించుకొని.. ఆ తర్వాతే వేసుకోవాలి. అందుకోసం ముందుగానే చర్మంపై కొంచెం వేసుకొని పరీక్షించుకోవాలి.

కొన్ని సందర్భాల్లో హెయిర్ డై లో ఉండే రసాయనాల వల్ల కళ్లు మండటం, గొంతులో ఇబ్బంది, వరసగా తుమ్ములు రావటం వంటి ఇబ్బందులు రావొచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్తమాకు దారితీయవచ్చు అని తెలుస్తుంది.

జుట్టుకు రంగు వేసుకునే టైంలో తప్పనిసరిగా గ్లౌవ్స్ వాడాలి. హెయిర్ డై లో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోవడం వలన దీనివల్ల వెంట్రుకలు రఫ్ గా అవుతాయి.

కొందరు హెయిర్ డైని తలకు మాత్రమే కాకుండా కనుబొమ్మలకు వాడుతుంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోరాదు.

ఈ హెయిర్ డై వాడే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ముప్పు కూడా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకోసమని ఇంట్లోనే సహజసిద్దమైన పద్ధతిలో హెయిర్ డై తయారుచేసుకొని వాడడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.