COVID -19 మహమ్మారి ఆరోగ్య సమస్యలు, యాంటీమైక్రోబయల్ నిరోధకత, పర్యావరణ హానితో ముడిపడి ఉన్న యాంటీమైక్రోబయల్ రసాయనాల అనవసరమైన వినియోగాన్ని పెంచింది. COVID-19 మహమ్మారి సమయంలో క్వాటర్నరీ అమ్మోనియం సమ్మేళనాలు (QACs) అని పిలువబడే యాంటీమైక్రోబయల్ రసాయనాల మితిమీరిన వినియోగం ఆరోగ్య సమస్యలు, యాంటీమైక్రోబయల్ నిరోధకత మరియు పర్యావరణ హానితో ముడిపడి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు అనవసరమైన వినియోగాన్ని తగ్గించాలని, సబ్బు మరియు నీటితో శుభ్రపరచాలని మరియు అన్ని ఉత్పత్తులలో QACలను పూర్తిగా బహిర్గతం చేయాలని సిఫార్సు చేస్తున్నారు.
ఇందులో భాగంగా శానిటైజర్లను అధికంగా వాడితే అనారోగ్య సమస్యల వస్తాయని చెబుతున్నారు. రసాయనాల అధిక వాడకం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటికి బదులు నీరు, సబ్బును వాడుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ తర్వాత శానిటైజర్ల వినియోగంపై అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి, అతి వాడకం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించారు.
క్వాటర్నరీ అమ్మోనియం కాంపౌండ్స్‌గా పిలుచుకునే యాంటి మైక్రోబయాల్ రసాయనాలను అధికంగా వాడితే రోగాల బారిన పడతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధకత పెరగదు సరికదా అనారోగ్యానికి గురవుతారని వెల్లడించారు. పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని తెలిపారు. శానిటైజర్లకు బదులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉబ్బసం, చర్మ వ్యాధులకు వీటి వాడకానికి మధ్య సంబంధం ఉన్నట్టు గుర్తించామని వివరించారు.