Newdelhi, June 11: సాయంత్రంపూట చేసే వ్యాయామం (Evening Exercise) వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ (Sugar Levels) మరింత నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో ఒకటి తెలిపింది. అధిక బరువు, ఊబకాయంతో బాధపడే పెద్దలు సాయంత్రం వేళ శారీరక శ్రమ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయని వెల్లడించింది. ఈ మేరకు స్పెయిన్ లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఒబేసిటీ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
Evening Exercise Lowers Blood Sugar in Overweight Adults
Evening exercise significantly lowers blood sugar levels in sedentary adults with overweight and obesity.
Researchers monitored 186 participants and discovered that physical activity in the evening was more effective for… pic.twitter.com/Qqx7GvYecO
— Neuroscience News (@NeuroscienceNew) June 10, 2024
అధ్యయనం సాగింది ఇలా..
మొత్తం 186 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు కొంతమందితో.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరికొంత మందితో.. సాయంత్రం 6 నుంచి అర్ధర్రాతి వరకు ఇంకొంత మందితో ఏకంగా 14 రోజులపాటు వ్యాయామం చేయించారు. 46 ఏండ్ల సగటు వయస్సు, అధిక బరువు ఉన్న వారిని ఈ ప్రయోగం కోసం ఎంచుకున్నారు.
తేలింది ఏంటంటే?
ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వ్యాయామం చేసిన వారితో పోలిస్తే, సాయంత్రం వేళల్లో శారీరక శ్రమ చేసిన వారి బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.