(Image: Facebook)

వ్యాయామం (exercise)  చేస్తున్నారా అయితే ఆ అలవాటు మంచిదే. వ్యాయామం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అయితే అతి వ్యాయామం శరీరానికి దుష్ఫలితాలను తెస్తుందంటున్నారు నిపుణులు. రన్నింగ్, ఈతకొట్టటం, సైక్లింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు చేసే సమయంలో త్వరగా అలసిపోతున్నట్టయితే శరీరం అధిక శ్రమకు గురవుతున్నట్టు భావించాలి.

>> వ్యాయామం  (exercise)  చేశాక బాగా అలసిపోయినట్టనిపిస్తే శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.

>> వారానికి ఏడున్నర గంటలకు మించి వ్యాయామం  (exercise)  చేసేవారిలో కుంగుబాటు, మానసిక ఆరోగ్యం క్షీణించటం, ఆందోళన వంటి దుష్ఫరిణామాలు తలెత్తుతాయి. గందరగోళానికి గురవటం, తికమక పడటం, చిరాకు, విసుగు, కోపం వంటి ప్రతికూల భావాలు పెరిగి ఒత్తిడికి గురవుతారని అధ్యయనాల్లో తేలింది.

>> శరీరానికి సరిపడ వ్యాయామం  (exercise)  చుస్తే మంచి నిద్ర వస్తుంది. అతిగా చేస్తే నిద్ర సరిగ్గా పట్టదు.

>> వ్యాయామం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందకుండా మళ్లీ వ్యాయామం చేయటం వల్ల కండరాలు వాస్తాయి. రోజువారీ పనులు చేసుకోవటం సమస్యగా మారుతుంది.

>> వ్యాయామం చేశాక మూత్రం ఎరుపు రంగులో వస్తుంటే పాడయిన కండర కణజాలం రక్తంలో చేరినట్టు గుర్తించాలి. ఇది మూత్రపిండాల సమస్యలకు దారి తీయవచ్చు.

>> వ్యాయామం పేరుతో శరీరాన్ని అధికంగా శ్రమకు గురిచేసే వారు గుండె పోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. గుండెలయలో తేడా వస్తుంది.

>> అధిక బరువులు ఎత్తే వ్యాయామాలు చేసేవారిలో త్వరగా కీళ్ల నొప్పి వస్తుంది. స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయిలు ప్రభావితమై రుతుక్రమం తప్పుతుంది.

>> ఉదయాన్నే గుండె వేగాన్ని పరిశీలించాలి. శరీరం మీద ఎక్కువ ఒత్తిడి పడితే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. సాధారణం కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటే శరీరం అధిక శ్రమకు గురవుతున్నట్టు భావించాలి.