Gas Trouble Home Remedy: గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నారా, ఇంగ్లీషు మందుల బదులు, ఈ వంటింటి చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది..
(Photo Credits: Pixabay)

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య గ్యాస్ ట్రబుల్ తరచుగా కడుపు ఉబ్బరంగా ఉండడం వికారంగా ఉండడం డిన్నర్ జీర్ణం కాకపోవడం అజీర్ణ సమస్యలు ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. దీనికి కారణాలు గనుక చూసినట్లయితే ఫైబర్ ఎక్కువగా లేకపోవడం వాటర్ కంటెంట్ తక్కువగా ఉండడం పోషకాలు లేనటువంటి ఆహారం తీసుకోవడం జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం సరైన శారీరక శ్రమ లేకపోవడం ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పవచ్చు.

దీనిని తగ్గించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ అవి కేవలం తాత్కాలికంగానే పనిచేస్తాయి. అలా కాకుండా కొన్ని జీవనశైలిలో మార్పులు తెచ్చుకొని కొన్ని ఆహార అలవాట్లను మార్చుకుంటే కచ్చితంగా ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు. మొదటిగా నూనె పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. సుమారు రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల మంచినీళ్లు తాగాలి.

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు, భగ్గుమంటున్న హిందూ సమాజం, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు

తప్పనిసరిగా ప్రతిరోజు ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఈ విధంగా చేసి మీరు ఉదయం పూట పరిగడుపున వాము జీలకర్ర ధనియాలు ఈ మూడింటిని పది గ్రాములు తీసుకొని నీళ్లలో మరిగించి కషాయంగా చేసుకొని తాగినట్లయితే కచ్చితంగా మీకు కడుపుబ్బరము అజీర్ణ సమస్య గ్యాస్ ట్రబుల్ సమస్య అన్ని కూడా పూర్తిగా తగ్గిపోతాయి. దీనిని ఒక 20 రోజులు గనక చేసినట్లయితే కచ్చితంగా మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది.