కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. అలా ఎక్కువసేపు కూర్చొని ఉంటే మీ ఆరోగ్యం పాడయిపోవడం ఖాయం అని నిపుణులు చెప్తున్నారు.. ప్రస్తుత కాలంలో కూర్చొని పనిచేసే ఉద్యోగాలు ఎక్కువయిపోయాయి. అందువల్ల శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలకు పనిలేక పాడైపోతున్నాయి.అందుకోసమని రోజు కనీసం 45 నిమిషాల పాటు నడక ఖచ్చితంగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అవేంటో తెలుసుకుందామా?
ఒకేచోటా గంటల తరబడి కూర్చొని కంప్యూటర్ మీద పనిచేసేవారు రెగ్యూలర్ గా బ్రిస్క్ వాకింగ్ చేయాలి. ఇలాంటి నడక చేయడం వలన ఆరోగ్యకరమైన బరువుతో పాటు శరీరంలో ఉన్న కొవ్వు బాగాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి సమస్యలను తరిమికొట్టవచ్చు.
టైప్-2 డయోబెటిస్ తో సహా వివిధ రకాలైన అనారోగ్యాలు దరిచేరకుండా నివారించవచ్చు. కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ ని మెరుగు పరిచేందుకు నడక చాలా చక్కని మార్గం అని తాజాగా ఓ అధ్యయనంలో తెలియజేసారు. ఎముకలు, కండరాలు ధృడంగా కావాలంటే ప్రతిరోజు నడకచేయాల్సిందే. ఇలాంటి నడకతో శరీర రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.