మన పొట్ట చుట్టు కొవ్వు పేరుకు పోవడం అనేది తీవ్రమైన సమస్య బెల్లీ ఫ్యాట్ వల్ల గుండెపోటు ,కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు పెరగడం, షుగర్ రావడం వంటి జబ్బులు వస్తాయి. మన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పెరగడం వల్ల రక్తపోటు సమస్య వస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బులు రక్తంలో కొవ్వు శాతం పెరగడం స్లీప్ ఆపినియా మధుమేహం క్యాన్సర్ బ్రెయిన్ స్ట్రోక్ ఫ్యాటీ లివర్ మూత్రపిండాల సమస్యలు వంటివి వస్తూ ఉంటాయి.
బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు
అధికంగా కేలరీలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, వయసు రిత్యా, కొన్నిసార్లు జన్యు శాస్త్ర ప్రకారంగా కూడా ఈ సమస్య వస్తుంది. అయితే మనము ప్రతిరోజు భరణి చేసే క్యాలరీల కంటే కూడా తీసుకునే క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. శారీరకంగా ఎటువంటి శ్రమ లేని వారికి కూడా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది పెరుగుతుంది.
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునే అంశాలు
వ్యాయామం- ఏరోబిక్ వ్యాయామాలు చేయడం ద్వారా మీరు తీసుకున్న క్యాలరీలు బర్న్ అవుతాయి. దీంతో బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. వేగంగా నడవడం పరిగెత్తడం సైకిల్ తొక్కడం ,బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ వంటి క్రీడలు ఆడడం ద్వారా కూడా ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా
చక్కెర వినియోగం తగ్గించాలి- అధికంగా చక్కర తినడం ద్వారా కూడా మీ పొట్ట చుట్టూ కొవ్వు ఏర్పడి అధిక బరువుకు దారితీస్తుంది. కాబట్టి చక్కెర తగ్గించడం ద్వారా ఈ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించవచ్చు.
ఆల్కహాల్- ఆల్కహాల్ తాగే వ్యక్తుల్లో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తాగడం ద్వారా మన శరీరానికి అదనపు కేలరీలు అందుతాయి. దీని ద్వారా మీరు బరువు పెరుగుతారు.
కూల్ డ్రింక్స్- కూల్ డ్రింక్స్ లలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో చక్కెర కూడా అధికంగా ఉంటుంది. దీని ద్వారా మీ పొట్ట చుట్టూ కొవ్వు ఏర్పడుతుంది. అధికంగా ఉండే క్యాలరీల వల్ల మీరు బరువు కూడా పెరుగుతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.