gas

చాలామంది ఎసిడిటీ పుల్లని త్రేనుపులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది కొన్ని ఆహారపు అలవాట్లు, ఒత్తిడి జీవన శైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య అనేది వస్తుంది. అయితే దీన్ని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే మందులు కాకుండా ఇంట్లోనే కొన్ని రెమెడీస్ ను తయారు చేసుకొని వాడడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

కారణాలు- పుల్లటి త్రేనుపులు ,ఎస్డిటి వంటి సమస్యలు రావడానికి ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలే కారణం ఎక్కువగా కారం తీసుకోవడం, వేయించిన డీప్ ఫ్రై ఆహార పదార్థాలను తీసుకోవడం, నమలకుండా వేగంగా తినడం, ఒత్తిడి ,ఆందోళన కెఫిన్, ఎక్కువగా ఉన్న కాఫీ, టీ లను తీసుకోవడం ,ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, వంటి వాటి వల్ల పుల్లటి త్రేనుపులు మరియు ఎసిడిటీ అనే సమస్య ఏర్పడుతుంది. దీనిని తగ్గించుకోవడం కోసం మన ఇంట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపు- సోంపు జీర్ణ క్రియ కు మేలు చేస్తుంది. గ్యాస్ ఎసిడిటీ పుల్లని త్రేనుపులు వంటి సమస్య నుండి బయట పడేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఒక స్పూన్ సోంపును తీసుకున్నట్లయితే జీర్ణ ఎంజైములు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఎసిడిటీని పుల్లటి త్రేనుపులు తగ్గిస్తుంది. సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. కడుపులో ఇబ్బందులను తగ్గించి జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది.

Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..

పుదీనా- పుదీనా ఆకులు కూడా ఎసిడిటీ గుండెల్లో మంట పుల్లటి త్రేనుపులు తగ్గిస్తుంది. ఇది ఇది శరీరానికి చలువదనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజు నాలుగైదు పుదీనా ఆకులను ఉదయాన్నే తిన్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇది మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా పుదీనా ఆకులను తినడం ద్వారా గ్యాస్ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

జీలకర్ర- జీలకర్ర కూడా జీర్ణ క్రియ కు చాలా మంచిది జీలకర్రను ఒక స్పూన్ తీసుకొని రెండు గ్లాసుల నీటిలో వేసుకొని మరిగించి ఆ జీలకర్ర నీటిని ప్రతి రోజు తీసుకున్నట్లయితే మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మీ శరీరంలో ఏర్పాట అనేక రకాలైనటువంటి టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇది గ్యాస్ ఎసిడిటీ, పుల్లటి త్రేనుపులు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా కడుపునొప్పి  వంటి సమస్యలు కూడా రావు. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ఇవి కాకుండా మీరు తీసుకున్న ఆహారం పైన కాస్త శ్రద్ధ వహించాలి. అతిగా తినకుండా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారాన్ని తరచుగా తినండి. తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. కాస్త వ్యాయామం, యోగా, ధ్యానం వంటి చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది, మీకు ఈ సమస్య మరింత ఇబ్బంది పెట్టినట్లయితే వైద్యుల్ని సంప్రదించి దానికి తగిన మందులు తీసుకోవడం ఉత్తమం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి