కొలెస్ట్రాల్ మన శరీరం పనితీరుకు అవసరం. అయితే హైపర్ కొలెస్ట్రాల్ అనేది చాలా హానికరం. ఇది గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో మంచి, చెడు రెండు కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి. అయితే చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో మనం తీసుకునే ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలకు కొలెస్ట్రాల్ ను పెంచే అవకాశం ఉంది . కాబట్టి ఆ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యి- భారతీయ వంటకాలలో నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆహారానికి రుచిని అందిస్తుంది. అయితే అధికంగా నెయ్యిని వినియోగించడం ద్వారా కొలెస్ట్రాల్ సమస్య మరింతగా పెరుగుతుంది.
Health Tips: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే మీ శరీరంలో ఏమవుతుంది
వెన్న- వెన్నను కూడా రకరకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. మార్కెట్లో లభించే వెన్నెల్లో అధిక మొత్తంలో ఫ్యాట్స్ ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి చాలా ఆహ్వానికరం.
రెడ్ మీట్- రెడ్మీ లో కూడా స్ట్రాచ్యులేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని అధికంగా తీసుకోవడం ద్వారా మీ కొలెస్ట్రా లెవెల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండె జబ్బులు వస్తాయి.
ఆయిల్ ఫుడ్స్- పకోడీలు, కచోరీలు, డీప్ ఫ్రై ఐటమ్స్ వడలు వంటివి అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో చేరుకొలెస్ట్రాల్స్థాయి పెరుగుతుంది. కాబట్టి మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.