మారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరంలో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను సరైన సమయంలో సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రకాల పండ్లు మన రక్తాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఈ పనులను మనము ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య నుండి దూరం అవుతాము. శరీరంలో రక్తం వేగంగా పెరగడం కూడా ప్రారంభమవుతుంది.
రక్తహీనత లక్షణాలు- మన శరీరంలో తగినంత రక్తం లేనప్పుడు కొన్ని రకాలైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నీరసము, బలహీనత, మైగ్రేను అలసట, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. మన శరీరంలో రక్తం తక్కువగా ఉందనేది రక్త పరీక్ష చేయించుకోవడం ద్వారా మన శరీరంలో ఎంత హిమోగ్లోబిన్ ఉందనేది గుర్తించుకోవచ్చు. శరీరం పసుపు రంగులో కనిపించినట్లయితే కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడినట్లయితే మన శరీరంలో తగినంత రక్తం లేనట్టుగా వీరిని రక్తహీనత సమస్యతో ఉన్నట్టుగా మనం భావించవచ్చు.
రక్తహీనత అంటే ఏమిటి- మన శరీరం ఆరోగ్యంగా ఫీట్ గా ఉండాలంటే మనకు ఐరన్ చాలా ముఖ్యము మన శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. మన హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడానికి ఈ కణాలు బాధ్యత వహిస్తాయి. హిమోగ్లోబిను ఊపిరితుల నుండి ఆక్సిజన్ తీసుకొని రక్తానికి సరఫరా చేస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ అనేది సరిగ్గా ఉండదు. దీని కారణంగా రకరకాల అయినటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని తగ్గించుకోవడం కోసము మనము మన ఆహారంలో కొన్ని పనులు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు ఇస్తున్నారా..
దానిమ్మ- దానిమ్మ పండులో రక్తహీనతను తగ్గించేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.
సిట్రస్ ఫ్రూట్స్- నారింజ ద్రాక్ష వంటి సి విటమిన్ అధికంగా ఉన్న పనులలో హిమోగ్లోబిన్ ని పెంచే తత్వం ఎక్కువగా ఉంది. ప్రతిరోజు వీటిని తీసుకోవడం ద్వారా మనము ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.
పైనాపిల్- పైనాపిల్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తాన్ని ఏర్పడడానికి కావాల్సినటువంటి మూలకాలు ఇందులో అధికంగా ఉంటాయి. దీన్ని తినడం ద్వారా మన శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉండదు.
ఆపిల్- ఆపిల్లో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా రక్తహీనత సమస్యను నయం చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు. ఆపిల్ ని ప్రతిరోజు తినడం ద్వారా రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాక అనేక రకాలైనటువంటి జబ్బులను తగ్గించడంలో కూడా ఈ ఆపిల్ అనేది సహకరిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.