Representative Image (IImage: File Pic)

Health Tips: మీ శరీరంలో విటమిన్ డి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండడం ద్వారా అనేక రకాల ప్రమాదాలు జరుగుతాయి. అంతేకాకుండా అనేక రకాల జబ్బులకు కారణం అవుతాయి. కొంతమంది డాక్టర్ సలహా లేకుండా కేవలం విటమిన్ డి టాబ్లెట్ లను వాడుతూ ఉంటారు. దీనివల్ల శరీరంలో విటమిన్ డి లెవెల్స్ పెరిగిపోతాయి. దీనివల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి.

విటమిన్ డి ప్రతికూలతలు- విటమిన్ డి మన శరీరంలో ఉండాల్సిందరికంటే ఎక్కువగా ఉండడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను తీసుకొని వస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్ కాబట్టి ఇది కరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దీన్ని తీసుకున్నప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మెదడు పనితీరులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆందోళన నిరాశ వంటి సమస్యలు పెరుగుతాయి.

Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా

రక్తంలో క్యాల్షియం పెరుగుతుంది- విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం ద్వారా రక్తంలో కాల్షియం పెరుగుతుంది. దీని ద్వారా అనేక రకాల సమస్యలు వస్తాయి.

కిడ్నీ సమస్యలు- శరీరంలో విటమిన్ డి పెరగడం ద్వారా కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా కిడ్నీల వాపు కిడ్నీలో రాళ్లు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నిద్రపైన ప్రభావం- విటమిన్ డి ఎక్కువ అవ్వడం వల్ల నిద్ర పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.  నిద్రలేమి సమస్య మరింతగా పెరిగి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి.

విటమిన్ డి టాబ్లెట్ లను తీసుకునే ముందు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. మీ శరీరంలో డి విటమిన్ చెక్ చేయించుకొని అప్పుడు సప్లిమెంట్స్ లో తీసుకోవడం ద్వారా ఎంతకాలం వాడడం అనేది డాక్టర్ సలహా మేరకు వాడితే సరిపోతుంది.

కొన్ని ఆహార పదార్థాలు సూర్యకాంతి ద్వారా కూడా నాచురల్ గా విటమిన్ డి లభిస్తుంది. కాబట్టి సూర్య రష్మి లో ప్రతిరోజు కాసేపు ఉన్నట్లయితే మీకు సహజంగానే డి విటమిన్ లభిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి