చిలగడ దుంపను స్వీట్ పొటాటో అని కూడా అంటారు. ఇది రుచికి చాలా తియ్యగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్లు పోషకాలు ఖనిజాలు ఫైబరు అన్నీ కూడా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి ,కళ్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్వీట్ పొటాటో తక్కువ క్యాలరీలో ఉంటాయి. ముఖ్యంగా అధిక ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి జీర్ణ సమస్యలు ఉన్నవారికి కూడా ఇదే చక్కగా పనిచేస్తుంది.

విటమిన్ ఎ- స్వీట్ పొటాటో లోవిటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ప్రతిరోజు మనం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మీకు విటమిన్ ఏ 90% వరకు లభిస్తుంది. విటమిన్ ఎ ను తీసుకోవడం ద్వారా మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని ద్వారా అనేక వ్యాధుల నుండి మనం బయటపడవచ్చు. విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సమస్యలు కూడా తగ్గుతాయి చర్మానికి కూడా చాలా మంచిది.

విటమిన్ డి- చిలకడదుంపల్లో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు దంతాలను బలోపేతం చేయడానికి సహకరిస్తుంది. విటమిన్ డి కాల్షియం శోషణకు  సహాయపడుతుంది. దీని ద్వారా మన ఎముకలు దృఢంగా ఉంటాయి. నాడీ వ్యవస్థను రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధులు రాకుండా చేస్తుంది.

విటమిన్ b6- చిలకడదుంపలు విటమిన్ b6 పుష్కలంగా ఉంటుంది రాకుండా చేస్తుంది.

Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..

కొలెస్ట్రాల్- చిలకడదుంపలు అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మన శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం ద్వారా మలబద్దక సమస్య కూడా తగ్గిపోతుంది. గుండె సమస్యలు రాకుండా కూడా ఉంటాయి.

ఐరన్- ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. రక్త కణాల నిర్మాణంలో ఐరన్ అత్యవసరమైన పాత్ర పోషిస్తుంది. దీనిలోపం వల్ల అలసట బలహీనత రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. అటువంటి వల్ల ఐరన్ లోపలి అధిగమించడంలో ఈ చిలకడదుంప సహాయపడుతుంది.

ఇన్ఫ్లమేషన్- మీరు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మన శరీరంలోని వాపులను నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బులు క్యాన్సరు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో కూడా ఈ చిలగడ దుంప సహాయపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.