source: pixabay

ముల్లంగిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబరు పొటాషియం, మెగ్నీషియం ,ఐరన్, జింక్ ,సెలీనియం వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. శీతాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. దీంట్లో అనేక రకాల పోషకాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని తిన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం అంత మంచిది కాదు. దీనివల్ల కొన్ని అనారోగ్య కరమైన సమస్యలు ఏర్పడతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టి- చాలామంది ముల్లంగితో చేసిన పరాటాలను టీతో కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదము ముల్లంగిని ఎట్టి పరిస్థితుల్లో తిన్నప్పుడు టీ వెంటనే తాగకూడదు. ముల్లంగి చలువ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే సమయంలో టి వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండిటిని కలిపి ఒకేసారి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. కనుక ముల్లంగి టీ ని కలిపి ఎప్పుడూ కూడా తినకూడదు.

నారింజ పండు- నారింజ పండ్లు విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సిట్రస్ జాతికి చెందిన పండు. ఇది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ఇదే సమయంలో ముల్లంగితో పాటు నారింజపండు తింటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దగ్గు గొంతులో నొప్పి ,ఊపిరితిత్తులు శేష్మము రావడం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నారింజపండు ముల్లంగిని కలిపి తినకూడదు.

Health Tips: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే మీ శరీరంలో ఏమవుతుంది

పాలు- పాలు ముల్లంగిని అస్సలు కలిపి తినకూడదు. ఈ రెండిటి కలయిక వల్ల అనేక అనర్ధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా చర్మ సంబంధ సమస్యలు, బొల్లి, సోరియాసిస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా జుట్టు రాలిపోవడం, మొహం పైన తెల్లటి మచ్చలు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆయుర్వేదంలో ముల్లంగి పాలు కలిపి తీసుకోవడం అనేది నిషేధించబడింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండిటి కలయిక అంత మంచిది కాదు.

కాకరకాయ- కాకరకాయ చేదు సోభవాన్ని కలిగి ఉంటుంది. అదే సమయంలో ఇది వేడి స్వభావాన్ని కూడా కలిగే ఉంటుంది. ఈ ముల్లంగి చలువ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండిటి కలయిక వల్ల కడుపులో పేగులు ఇబ్బంది పడతాయి. అంతేకాకుండా జీర్ణ క్రియ మందగిస్తుంది. దీని ద్వారా మలబద్ధకము సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కాకరకాయ తీసుకున్నప్పుడు ముల్లంగిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి