ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతుంది. మధుమేహం రక్తంలోని షుగర్ లెవెల్స్ ను పెరగడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. మధుమేహం ఉన్నవారు ఆహారం సరిగ్గా తీసుకోకపోతే కూడా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మధుమేహం అనేది ఏ వయసులో ఉన్నవారికైనా వస్తుంది. పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు వంటి వాటిని తీసుకోవడం ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నవారు మాంసాహారాన్ని తీసుకోకూడదు. దీనివల్ల వారిలో కొలెస్ట్రాల్ సాయి కూడా పెరుగుతుంది. వీరు ఎక్కువగా కూరగాయలు పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అయితే కొన్ని రకాలైనటువంటి వెజ్ సూపులను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అవి షుగర్ని మాత్రమే కాకుండా మన శరీరానికి కావలసిన ఎన్నో లాభాలను అందిస్తాయి. ఆ సూపులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
టమాటో సూప్- మధుమేహం ఉన్నవారు టమాటా సూప్ ను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. టమాటా సూప్ తయారు చేసుకోవడానికి ముందుగా రెండు టమాటాలను తీసుకొని వాటిని ఉడికించి చల్లార్చిన తర్వాత ఫ్యూరీ లాగా చేసుకుని అందులో తగినన్ని నీళ్లు పోసి ఉడకబెట్టాలి. తర్వాత అందులో మిరియాల పొడి కొద్దిగా ఉప్పు కాస్త పంచదార వేసుకొని కాసేపు మరిగిన తర్వాత దీన్ని వడపోసుకొని తాగాలి. ఈ సూపును తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
Health Tips: దంతాల సమస్యతో బాధపడుతున్నారా..
మష్రూమ్ సూప్- మష్రూమ్ సూప్ కూడా మధుమేహం ఉన్నవారికి చక్కటి సూప్ గా చెప్పవచ్చు. ఇది షుగర్ లెవెల్స్ లో కంట్రోల్ లో చేస్తుంది. మష్రూమ్స్ తయారు చేయడానికి కొన్ని మష్రూమ్ తీసుకొని వాటిని నీళ్లలో వేసి ఉడకబెట్టుకొని అందులో కొంచెం గోధుమపిండి 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకుని తాగినట్లయితే అనేక రకాలైనటువంటి పోషకాలు లభిస్తాయి.
చికెన్ సూప్- మధుమేహం ఉన్నవారికి చికెన్ కంటే కూడా చికెన్ సూప్ చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనికోసం 100g చికెన్ తీసుకొని ఒక కుక్కర్ లో వేసుకొని అందులో కొంచెం అల్లం ,మిరియాలు, వెల్లుల్లి దాల్చిన చెక్క, జీలకర్ర, రెండు టమాటాలు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ చేసుకొని అందులో తగినన్ని నీళ్లు పోసుకుని రుచికి కావాల్సినంత ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని కాసేపు మరిగించిన తర్వాత దీన్ని కాస్త నిమ్మరసం వేసుకొని తాగినట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అనేక రకాల పోషకాలు కూడా అందుతాయి.
బ్రకోలీ సూప్- బ్రకరిలో అనేక రకాల పుష్కాలు ఉన్నాయి. ఇది షుగర్ లెవల్సిన కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. బ్రోకోలిన్ తీసుకొని దాని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత దాంట్లో మీరు పోసి దాల్చిన చెక్క ,లవంగాలు, వెల్లుల్లి, రెబ్బలు రెండు టమాటాలు వేసి మెత్తగా అయ్యేవరకు మళ్లీ కుక్కర్లో ఉడికించాలి. తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని ప్యూరీ లాగా చేసుకున్న తర్వాత మళ్లీ కాస్త వాటర్ కలుపుకొని తీసుకున్నట్లయితే ఎన్నో పోషకాలు ఉన్న బ్రకోలీ అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి