Headache (Photo Credits: Pixabay)

తలనొప్పి అనేది సర్వసాధారణమైన సమస్య. కొన్నిసార్లు తలనొప్పి అనేది సమస్యలకు సంకేతంగా కూడా చెప్పవచ్చు. శరీరంలో భాగంలో గాక తలలో కూడా ఈ నొప్పి మన పూర్తిగా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు తలనొప్పిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే అనేక రకాల మందులను వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే తలనొప్పి ఏ కారణాల వల్ల వస్తుంది. ఎన్ని రకాలుగా ఉంటుంది. అనేది ఈరోజు మనం తెలుసుకుందాం.

ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి- తలనొప్పి ఒత్తిడి వల్ల వస్తుంది. తల వెనుక భాగంలో ,తలపై భాగంలో వచ్చే తలనొప్పిని ఒత్తిడి కారణంగా చెప్పవచ్చు. ఒత్తిడి ఆందోళన మానసిక ఒత్తిడి దీనికి కారణంగా చెప్పవచ్చు.  దీనిని నివారించడానికి మన దినచర్యను మార్చుకుంటే మంచిది. ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ప్రాణాయామం, యోగ వంటివి చేసినట్లయితే ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పులను తగ్గించుకోవచ్చు.

డిహైడ్రేషన్ తలనొప్పి- తలలో పై భాగాన ,కింది భాగాన నొప్పి ఉంటే అది డిహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిగా చెప్పవచ్చు. ఇది తగ్గించుకోవడం కోసం ఎక్కువ నీరు త్రాగడం మంచిది. మన శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఖచ్చితంగా తలనొప్పి అనేది వస్తుంది. తాజా ఆహార పండ్లు కూరగాయల్లో వంటి వాటిలలో నీరు అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

Health Tips: జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా ,

అలసట వల్ల వచ్చే తలనొప్పి- ఈ తలనొప్పి తలపై భాగంలో వస్తూ ఉంటుంది. దీనికి శరీరానికి తగినంత విశ్రాంతి లేనప్పుడు అలసట వల్ల వచ్చే తలనొప్పి అనేది వస్తుంది. నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ అలసట వల్ల వచ్చే తలనొప్పి ఎక్కువగా ఉంటుంది.

సైనస్ తలనొప్పి- ఇది ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే తలనొప్పి సైనస్ అనే దాని ద్వారా వచ్చే తలనొప్పిని సైనస్ తలనొప్పి అని అంటారు. ఇది తల ముందు భాగంలో నుదుటిపైన కళ్ళ క్రింద ముక్కు చుట్టూ నొప్పిని కలిగిస్తుంది. ముఖ్యంగా జలుబు, జ్వరం సమయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. దీన్ని తత్కాలికంగా ఉపశమనం కోసము ఆవిరి పట్టడం వేడినీరు తాగడం వంటివి చేసినట్లయితే ఈ తలనొప్పి తగ్గుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి