(Credits: X)

ఆకుకూరల్లో పొన్నగంటి ఆకుకూర కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ బి 3,బి 6 విటమిన్ సి, ఈ మినరల్స్ ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి. పొన్నగంటి కూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ క్రియ- పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్ ,ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు. పొన్నగంటి కూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులను న్యాయం చేయడంలో పొన్నగంటి కూర సహాయపడుతుంది.

డీటాక్స్- పొన్నగంటి కూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటికి పంపించడానికి సహాయపడుతుంది. మూత్ర సంబంధ వ్యాధులను తగ్గించడానికి కూడా పొన్నగంటి కూర సహాయపడుతుంది.

Health Tips: ఆలివ్ ఆయిల్ వాడడం ద్వారా కలిగే లాభాలు ఏమిటి?

యాంటీ ఆక్సిడెంట్లు- పొన్నగంటి కూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా బయటపడతారు. అంతేకాకుండా సీజనల్గా వచ్చే అనేక రకాల జబ్బుల నుండి బయటపడవచ్చు.

బరువు తగ్గుతారు- పొన్నగంటి కూరను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఇది మన శరీరానికి కావాల్సినంత నీటి శాతాన్ని అందిస్తుంది. చర్మాన్ని ఎప్పుడూ కూడా హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలి అనుకునేవారు పొన్నగంటి కూరను ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మీ బరువు నియంత్రణలో ఉంటుంది.

గుండెకు మంచిది- పొన్నగంటి కోణం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి