చాలామంది తీపి తినడానికి ఇష్టపడతారు. మన ఇంట్లో ప్రతి శుభకార్యాలలో ,బయట పార్టీలు అప్పుడు కూడా స్వీట్స్ అధికంగా తింటారు నిజానికి స్వీట్ అనేది చాలా అనారోగ్యకరం. చక్కెరను వైట్ పాయిజన్ కూడా అని అంటారు. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల అనేక రకాలైన తీవ్రమైన వ్యాధులు గురవుతారు.
చక్కెరలో అసలు ఎటువంటి పోషకాలు ఉండవు. చక్కెర తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధులు వస్తాయి. చెక్కరను మన శరీరంలో కేలరీలను పెంచుతుంది. అంతేకాకుండా ఇది మన జీర్ణ క్రియలకు హానిచేస్తుంది. అయితే మనము ప్రతిరోజు ఎంత మన ఆహారంలో ఎంత చక్కెరను తీసుకోవచ్చు తెలుసుకుందాం.
ఎంత చక్కర తినాలి- ఒక మనిషి ప్రతిరోజు 8 టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెరను తీసుకోకూడదు. అదే మహిళలైతే కేవలం 5 నుండి 6 టీ స్పూన్లు మాత్రమే తీసుకోవాలి.
Health Tips: కీర దోసకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
అధిక చక్కెరవల్ల కలిగే నష్టాలు- ప్రతిరోజు పురుషులు అయితే 8 టీ స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. అదేవిధంగా మహిళలైతే ఐదు టీ స్పూన్ల కంటే ఎక్కువగా చక్కెరను తీసుకోకూడదు. ఒకవేళ మీరు అంతకంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అధికంగా చక్కెర తీసుకోవడం ద్వారా అధిక బరువు పెరుగుతారు. దీని వల్ల కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. అధికంగా చక్కెర తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అధికంగా షుగర్ తీసుకునే వారిలో మధుమేహ సమస్య కూడా పెరుగుతుంది. ముఖ్యంగా టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కర అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మీకు చర్మం పైన అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మొటిమలు ఏర్పడతాయి. వేగంగా వృద్ధాప్య లక్షణాలు కూడా ఏర్పడతాయి. మన చర్మం పై ఉన్న తేమే తగ్గిపోతుంది. దీని కారణంగా చర్మం పులుసుబారుతుంది అధికంగా చక్కెర ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మన శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.