raisins

Health Tips: ఎండు ద్రాక్షాలు అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది .దీన్ని పాలలో నానబెట్టుకొని తినడం ద్వారా మరిన్ని పోషకాలు అందుతాయి. అంతేకాకుండా అనేక రకాల జబ్బులు రాకుండా ఉంచడంలో సహాయపడుతుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.. ఎండు ద్రాక్షాలు ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని పాలలో నానబెట్టుకుని తినడం వల్ల గ్యాస్, కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా చక్కటి నిద్ర కూడా పడుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది.

Health Tips: ఖాళీ కడుపుతో లీచీ తింటే ప్రాణాపాయం..

గుండె ఆరోగ్యానికి మంచిది.. ఎండు ద్రాక్షలు ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండడం ద్వారా గుండె ఆరోగ్యానికి మంచిది.

ఎముకలకు మంచిది.. పాలలో క్యాల్షియం ఉంటుంది. ఎండు ద్రాక్షలో ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉండడం ద్వారా ఈ రెండిటి కలయిక వల్ల ఎముకల బలానికి పటిష్టతకు కండరాల బలానికి సహాయపడుతుంది.

బీపీ కంట్రోల్ లో ఉంటుంది.. ఎండుద్రాక్ష లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది కొలెస్ట్రాల్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.

ఎలా తీసుకోవాలి- ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో ఎండు ద్రాక్షాలను ఒక ఎనిమిది నుంచి పది వేసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టిన తర్వాత వీటిని తీసుకోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

Disclaimer:పైన పేర్కొన్న విషయం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీ ఆరోగ్య సమస్యల కోసం సమీపంలో సర్టిఫైడ్ మెడికల్ డాక్టర్లను సంప్రదించండి