(Credits: X)

ఈ సీజనల్ లో ఎక్కువగా కనిపించే ఫ్రూట్ స్ట్రాబెర్రీ దీన్ని రుచి తీపి ,పులుపుకు రుచితో చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది చూడడానికి ఎరుపు రంగులో ఉండి ఆకర్షిస్తుంది. స్ట్రాబెరీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. స్ట్రాబెరీ లో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం పోలేట్ మ్యాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా స్ట్రాబెర్రీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అండ్ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం ద్వారా అనేక రకాల జబ్బులు తగ్గించడంలో సహాయపడుతుంది ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

యాంటీ ఆక్సిడెంట్లు- స్ట్రాబెరీ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియము, పుష్కలంగా ఉంటాయి. ఇది బీపీని కంట్రోల్లో చేస్తుంది. దీని ద్వారా గుండె జబ్బుల ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు చాలా మేలు చేస్తాయి.

ఇమ్యూనిటీని పెంచుతుంది- స్ట్రాబెరీ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపితం చేస్తుంది. దీని ద్వారా ఈ సీజనల్గా వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ నుండి పోరాడడానికి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. స్ట్రాబెరీ చాలా బాగా సహాయపడుతుంది.

Health Tips: ముల్లంగి ప్రతిరోజు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...

కంటి చూపును పెంచుతుంది- స్ట్రాబెరీ లో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి సమస్యను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చూపు తగ్గిపోవడం వంటి సమస్యను తగ్గిస్తుంది.

బరువు తగ్గుతారు- స్ట్రాబెరీ లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకున్నప్పుడు ఎక్కువసేపు ఆకలి అనిపించడం అనిపించదు. దీని ద్వారా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా మీరు ఫిట్నెస్ గా ఉంటారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి