![](https://test1.latestly.com/wp-content/uploads/2023/12/carrot.jpg?width=380&height=214)
Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. వీరిలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ ఉన్నప్పుడు అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే క్యారెట్ బీట్రూట్ రసం తీసుకోవడం ద్వారా అనేక సమస్యలు తొలుగుతాయి. అనేక రకాల వ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది. క్యారెట్ బీట్రూట్ రసం తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇమ్యూనిటీ పెరుగుతుంది- క్యారెట్ బీట్రూట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. రెగ్యులర్గా జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లు సమస్యలు రాకుండా ఉంచేందుకు సహాయపడుతుంది.
జీర్ణ వ్యవస్థ- క్యారెట్ బీట్రూట్ రసం తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోవడంలో సహాయపడుతుంది.
Health Tips: రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగుతున్నారా?
బరువు తగ్గుతారు- అధిక బరువు సమస్యతో బాధపడేవారు క్యారెట్ బీట్రూట్స్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని ద్వారా కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది..
గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది- క్యారెట్ బీట్రూట్ రసం తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే నైట్ రేట్లు రక్తపోటును తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది..
క్యారెట్ ,బీట్‌రూట్ జ్యూస్ తాగడానికి సరైన సమయం- ఈ జ్యూస్‌ను రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు, కానీ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఉదయం దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ పోషణ లభిస్తుంది. రోజంతా శక్తిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది.
క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్‌లను ఎన్ని రోజులు తాగాలి- మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటే, ఈ జ్యూస్‌ను ప్రతిరోజూ తీసుకోవచ్చు. కానీ మీకు డయాబెటిస్, మూత్రపిండాల సమస్యలు లేదా ఏదైనా ఇతర ఆరోగ్య సంబంధిత సమస్య ఉంటే, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దానిని తీసుకోండి. అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల కొంతమందికి హాని కూడా కలుగుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి