నువ్వులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారు. ఇది శరీరంలో వేడిని పుట్టించడమే కాకుండా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గించడంలో నువ్వులు సహాయపడతాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తహీనతను తొలగిస్తుంది- నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎనిమియా పేషంట్లకు ఒక చక్కటి వరంగా చెప్పవచ్చు. ప్రతిరోజు ఒక స్పూను నువ్వుల్ని తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రక్త శుద్ధికి కూడా ఇది సహాయపడుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచడంలో నువ్వులు సహాయపడతాయి.

Health Tips: మీరు భోజనం చేసేటప్పుడు చెమట ఎక్కువగా పడుతుందా, 

గుండె జబ్బులు రాకుండా చేస్తుంది- నువ్వులలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో పేర్కొన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో నువ్వులు సహాయపడతాయి.

ఎముకలు దృఢంగా మారుతాయి- నువ్వులలో పాలకంటే అధికంగా కాల్షియం ఉంటుంది. దీన్ని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా దంతాలకు కూడా బలాన్ని చేకూరుస్తుంది.

ఇమ్యూనిటీని పెంచుతుంది- నువ్వులలో జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇమ్యూనిటీ పెరగడం ద్వారా అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి. చలికాలంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్లను తొలగించడంలో నువ్వుల సహాయపడతాయి.

నువ్వులను ఏ విధంగా తీసుకోవచ్చు.

నువ్వులే బెల్లం తో కలిపి లడ్డు లాగా చేసుకుని తినవచ్చు. దీని ద్వారా బెల్లం లో ఉన్న పోషకాలు కూడా అందుతాయి. బెల్లం లో కూడా ఐరన్ ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా

నువ్వులను దోరగా వేయించి ప్రతిరోజు ఒక స్పూను తిన్నట్లయితే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి