rice

భారతదేశంలో చాలా మంది ప్రజలకు అన్నం అనేది ప్రధాన ఆహారంగా చెప్పవచ్చు. అయితే దీనిపైన పూర్తిగా ఆధారపడడం కూడా మన ఆరోగ్యానికి చాలా హానికరం. అన్నంలో కార్బోహైడ్రేట్స్ లో ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఎటువంటి పోషకాలు కూడా ఉండవు. అధికంగా బియ్యాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా అన్నాన్ని తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు. ఒక 30 రోజుల పాటు అన్నం తినకుండా ఉంటే మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..

బరువు తగ్గడం- ఒక నెల రోజులపాటు అన్నాన్ని మానేస్తే మన శరీరంలో క్యాలరీల సంఖ్య తగ్గుతుంది. దీని కారణంగా మీరు క్రమంగా బరువు తగ్గుతారు. అన్నంలో కార్బోహైడ్రేట్ల అధికంగా ఉండడం వల్ల ఇది బరువును పెంచుతుంది. కాబట్టి నెల రోజులపాటు మీరు బియ్యాన్ని ఆహారంలో చేర్చుకోకుండా ఉంటే కచ్చితంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

గుండెకు మంచిది- బియ్యంలో అధిక మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల స్థాయిని పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బులు ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే బియ్యం ని ఆహారంలో చేర్చుకోకుండా ఉంటేనే మంచిది.

షుగర్ కంట్రోల్- నెల రోజులపాటు అన్నాన్ని తినకుండా ఉన్నట్లయితే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలో తక్కువగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్ అధికంగా ఉండడం వల్ల మీ షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు అన్నాన్ని మానుకుంటే ఉత్తమం.

అయితే అన్నాన్ని మానుకోవడం వల్ల పోషకాహారం లోపాన్ని తగ్గించుకోవడం కోసం ఇతర ఆహార పదార్థాలను చేర్చుకోవచ్చు.గోధుమలు, కొర్రలు, రాగులు, జొన్నలు వంటి వాటిని మీరు ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటితోపాటు ఆకుకూరలు కూరగాయలు పండ్లను కూడా మీరు ఆహారాలలో భాగం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క శరీరం భిన్నంగా ఉంటుంది. కాబట్టి వారికి పోషకాలు అవసరం. మీరు ఇటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి