ginger

చలికాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. అయితే కొన్ని ఇంట్లోనే దొరికే పదార్థాలతో కషాయం చేసుకొని ఈ చలికాలంలో తీసుకున్నట్లయితే తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. ఆ కషాయం ఏమిటో దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కషాయం చేసుకోవడానికి కావలసిన పదార్థాలు- తులసాకులు, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క.

తయారు చేసుకునే విధానం- ఒక గ్లాసు నీటిని మరిగించుకోవాలి అందులో తులసాకులను, అల్లం ముక్కలను, దంచిన మిర్యాలను వేసుకొని మరిగించుకోవాలి.. అంతేకాకుండా ఇందులో దాల్చిన చెక్క ఒకటి వేసుకొని మరిగించుకోవాలి ఈ కషాయము బాగా మరిగిన తర్వాత ఒక గ్లాసులోకి వడగట్టుకుని రుచికి తగినంతగా నిమ్మరసాన్ని కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగినట్లయితే చలికాలంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారి నుంచి బయటపడవచ్చు.

Health Tips: బ్లాక్ టీ మంచిదా బ్లాక్ కాఫీ మంచిదా తెలుసుకుందాం..

తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది జలుబు, దగ్గు సమస్య నుంచి బయటపడేస్తుంది. అల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని పెంచడానికి రోగనిరోధక వ్యవస్థను బలాపర్చడానికి సహాయపడుతుంది. దీని ద్వారా రకరకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది. మిరియాల లో ఘాటు స్వభావం కలిగి ఉంటుంది. ఇది గొంతు నొప్పి గొంతు గరగర వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ ను తొలగించడంలో సహాయపడుతుంది.

ఈ కషాయాన్ని పిల్లలకైతే అరకప్పు పెద్దవాళ్లయితే ఒక కప్పు ప్రతిరోజూ రెండు సార్లు తీసుకోవడం వల్ల తరచుగా వచ్చే జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది. దీని ద్వారా సీజనల్ వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారి నుండి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి