ఈ మధ్యకాలంలో పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అన్న సమస్యతో చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనికోసం పసుపు కలిపిన పాలను పిల్లకి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్లకు, టీవీలకు అలవాటు అవుతున్నారు. దీనివల్ల వారిలో నిద్ర కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటి అప్పుడు వారు జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పసుపు పాలను రాత్రి పూట పడుకునే ముందు పిల్లలకు ఇచ్చినట్లయితే అది మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల రిలాక్స్ కూడా అవుతారు. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ఒత్తిడి తగ్గుతుంది-పిల్లల్లో, పెద్దల్లో కూడా ఈ మధ్యకాలంలో ఒత్తిడి సమస్య చాలా పెరుగుతుంది. ఒత్తిడి లేకుండా ఉండడానికి కొంతమంది మందులు వేసుకుంటూ ఉంటారు. సప్లిమెంట్స్ తీసుకుంటారు అయితే ఇది శరీరానికి హానిచేస్తాయి. అలా కాకుండా స్ట్రెస్ లేకుండా ఉండడానికి పసుపు కలిపిన పాలను రాత్రి పూట తాగినట్లయితే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
బ్రెయిన్ యాక్టివ్- పసుపు కలిపిన పాలను రాత్రిపూట క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మీ మెదడు యాక్టివ్ గా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. వేడి పాలల్లో పసుపు కలిపి తీసుకోవడం వల్ల మెదడు నరాలకు సరఫరా బాగా జరుగుతుంది. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా.
మంచి నిద్ర- చాలామంది ఈ మధ్యకాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. పిల్లల్లో కూడా ఈ సమస్య రోజురోజుకి ఎక్కువగా అవుతుంది. అటువంటి అప్పుడు రాత్రిపూట ఒక గ్లాస్ పాలల్లో కాస్త పసుపు కలిపి ఇచ్చినట్లయితే పిల్లలు త్వరగా నిద్రపోతారు. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒత్తిడి తగ్గినప్పుడు నిద్ర అనేది వస్తుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది- పిల్లలు ఈ మధ్యకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తరచుగా వస్తున్నాయి. వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పసుపు ఇది యాంటీ ఆక్సిడెంట్ గా, యాంటీ ఇంఫ్లమేటర్ గా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల రోగాలు రాకుండా ఉంటాయి.
జీర్ణశక్తిని పెంచుతుంది- పసుపు పాలు తాచుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఒక గ్లాసు పసుపు పాలు తీసుకోవడం వల్ల మన జీలక్రియ మెరుగుపడుతుంది. పిల్లలు గ్యాస్ అజీర్ణం ఇటువంటి సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో ఎక్కువగా కడుపునొప్పి వంటి వ్యాధితో ఇబ్బంది పడుతుంటారు. దీన్ని తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి