Benefits of Drinking Water (Photo Credits: PxHere)

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు (Drinking hot water Benefits) ఉంటాయని తెలుసు.రోజు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల (Drinking Hot water) ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే వేడి నీళ్లు తాగడం వల్ల కూడా కొన్ని నష్టాలు (Drinking hot water Risks) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వేడినీరు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు. ఎక్కువ వేడి నీరు తాగటం వల్ల నోటిపూత ఏర్పడే ప్రమాదం ఉంది.అలాగే నోటిలో చిన్న కాలిన గాయాలకు కారణమైతే, అది ఖచ్చితంగా శరీరంలోని అంతర్గత అవయవాల లైనింగ్‌పై ప్రభావం చూపుతుందట.

అత్యంత సాధారణంగా ప్రభావితమైన అవయవాలు అన్నవాహిక మరియు జీర్ణవ్యవస్థ, ఇవి సున్నితమైన లోపలి పొరను కలిగి ఉంటాయి. వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండటం వలన అవి ప్రభావితమవుతాయి కనుక మితిమీరిన వేడినీటిని తాగరాదని నిపుణులు చెబుతున్నారు. అధికంగా వేడి నీటిని తాగడం వల్ల మూత్రపిండాలకు అదనపు పని పెరుగుతుంది. దీంతో హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని నీటి సాంద్రతలో అసమతుల్యత ఏర్పడుతుందని చెబుతారు.

మాత్రలు మింగే వారు వీటితో కలిపి వేసుకోవద్దు, అలా మింగితే మాత్రలు పనిచేయకపోయే ప్రమాదం ఉందంటున్న డాక్టర్లు

దీంతో ఒకేసారి ఎక్కువ నీరు మెదడు కణాల వాపుకు కారణమవుతుంది. కనుక ఇది మానవ శరీరానికి ప్రమాదకరం.వేడి నీటిని ఎక్కువగా తాగడం కూడా రక్త పరిమాణానికి ప్రమాదకరం. అవసరమైన దానికంటే ఎక్కువ వేడి నీటిని తీసుకోవడం వల్ల మొత్తం రక్త పరిమాణం పెరుగుతుంది.దీంతో అధిక రక్తపోటుతో పాటు అనేక ఇతర గుండె సంబంధిత సమస్యలకు ఇది దారితీస్తుంది.