చలికాలంలో మనము తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటాము. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు ఫ్లూ వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లల్లో ముఖ్యంగా తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. శక్తి బలహీనంగా ఉండడం వల్ల ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే చలికాలంలో కొన్ని ఆరోగ్యకరమైన సూప్స్ తీసుకోవడం ద్వారా మనకు మేలు జరుగుతాయి. ఇవి రుచిగా కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా సూప్- టమాటలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటి నుంచి బయటపడడంలో సహాయపడుతుంది. వేడివేడిగా టమాటా సూప్ తాగడం వల్ల గొంతు నొప్పి, బ్లాక్ అయిన ముక్కుల నుండి ఉపశమనం లభిస్తుంది. టమాటాలను ఉడకబెట్టి రుబ్బి వెల్లుల్లిని కలిపి కొంచెం అల్లం వేసుకుని కొద్దిగా వెన్న జోడించుకొని తాగడం వల్ల మీకు గొంతు నొప్పి, జలుబు జ్వరం, నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంట్లో మిరియాలు వేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి.
Health Tips: మిరియాల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...
పాలకూర సూప్- పాలకూరలో రోటీలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, పోలేట్, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ సూపును తీసుకోవడం ద్వారా ఇందులో ఉన్న గుణాలు జలుబు, దగ్గు వంటి వాటి నుంచి బయట పడేస్తాయి, దీనిలో కాస్త పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, వేసుకొని మిక్సీలో రుబ్బుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మీకు ఇమ్యూనిటీ పెరగడంతో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా బయటపడతారు..
చిక్ పీస్- చిక్ పీస్ లో విటమిన్ ఏ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని నాన్న పెట్టుకొని మిక్సీలో రుబ్బుకున్న తర్వాత వీటికి కాస్త అల్లం, వెల్లుల్లి, క్రీమ్ జోడించి సర్వ్ చేసుకుని తాగినట్లయితే అనేక రకాల పోషకాలు లభిస్తాయి..
చలికాలంలో సూపులు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది- సూపులులలో ఉండే విటమిన్లు మినరల్స్ ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థను బలోపితం చేస్తాయి. దీని ద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. తరచుగా వీటిని తీసుకోవడం ద్వారా చలికాలంలో వచ్చే జలుబు దగ్గు వంటి వాటి నుంచి బయటపడవచ్చు.
గొంతు ముక్కు సమస్యలు- వేడివేడి సూపుతాగడం వల్ల గొంతు నొప్పి ,బ్లాక్ అయిన ముక్కల నుండి ఉపశమనం లభిస్తుంది. జరుగుతో బాధపడేవారు ఈ వేడివేడి సూపులును తాగడం ద్వారా జలుబు తగ్గే అవకాశం తొందరగా ఉంటుంది.
జీర్ణశక్తికి మంచిది- కొంతమందిలో చలికాలంలో అన్నం త్వరగా జీర్ణం అవ్వదు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కానప్పుడు ఇటువంటి సూపులు తీసుకోవడం ద్వారా ఇవి తేలికగా జీర్ణం అవుతాయి.
హైడ్రేషన్- చలికాలంలో చాలామంది నీరు తక్కువగా తాగుతూ ఉంటారు. దీనివల్ల శరీరంలో డిహైడ్రేషన్ అనేది వస్తుంది. అలా కాకుండా తీసుకోవడం ద్వారా శరీరం ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి