noodles

చాలామంది ఉదయాన్నే అల్పాహారం విషయం లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ టిఫిన్ అనేది మన రోజులు ప్రారంభించడంలో చాలా ముఖ్యమైన భాగం. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచిది. ఉదయం పూట ఆయిల్ ఫుడ్స్, తింటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలామంది తొందరగా అయిపోతుందని నూడిల్స్ ని కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గా తింటారు. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. అంతే కాకుండా తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయితే మన ఆహారంలో పోషకాహారాలను చేర్చుకుంటూ మన అల్పాహారాన్ని తీసుకోవడం ద్వారా మన శక్తిని పెంపొందించుకోవచ్చు. రోజంతా కూడా చురుకుగా ఉండొచ్చు .అయితే ఉదయాన్నే ఎటువంటి టిఫిన్స్ తినడం వల్ల మనకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

మొలకెత్తిన గింజలు- ఉదయాన్నే అల్పాహార సమయంలో మొలకెత్తిన గింజలను లేదా ఉడకబెట్టిన శనగలు, పల్లీలను తీసుకున్నట్లయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది గ్యాస్ ప్రాబ్లం తో బాధపడే వారికి ఇది చక్కటి పరిష్కరణ చెప్పవచ్చు. అంతేకాకుండా దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ఫైబర్ కూడా పుష్కలంగా ఉండడం ద్వారా గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు.

Health Tips: చామంతి టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

దోశ-  దోశ కూడా ఉదయం అల్పాహారంలో ఆరోగ్యకరమైన ఎంపికగా చెప్పవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో మినప్పప్పు వాడడం ద్వారా ఇందులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అల్పాహారంలో దోశ మీరు చేర్చుకున్నట్లైతే మీకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. దీన్ని పల్లి చట్నీతో తీసుకోవడం వల్ల మీకు ప్రోటీన్ కూడా లభిస్తుంది.

ఇడ్లీ- ఎటువంటి ఆయిల్ లేకుండా ఆవిరి మీద ఉడికించే ఇడ్లీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా ఆరోగ్యకరమైన టిఫిన్ గా చెప్పవచ్చు. ఇది మనకు శక్తిని అందించడమే కాకుండా బరువుని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇడ్లీని చట్నీతో సాంబార్ తో తీసుకోవడం వల్ల మీకు రుచిగా కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇది పోషకారాలు పుష్కలంగా ఉంది. త్వరగా జీర్ణం అవుతుంది.

గుడ్లు- గుడ్లు ప్రోటీన్ కి ఒక మంచి సోర్స్ గా చెప్పవచ్చు. చాలామంది ఉదయాన్నే ఉడకపెట్టిన కోడిగుడ్లు తింటూ ఉంటారు. ఇది మన శరీరానికి కావాల్సిన పోషకాలను అంది అందిస్తుంది. అంతేకాకుండా మన జీర్ణక్రియ రేటును పెంచుతుంది. ఉదయాన్నే కోడిగుడ్లు తినడం వల్ల మీకు అనేక రకాల లాభాలు కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లల్లో ఎదుగుదలకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది.

పోహా- ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా పోహాన్ని తీసుకున్నట్లయితే ఇది త్వరగా జీర్ణం అవుతుంది. ఇందులో కూరగాయలు ఎక్కువగా వేసుకొని తిన్నట్లయితే పోషకాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఇది తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. దీనివల్ల బరువు తగ్గుతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి