తరచుగా బలహీనంగా ఉండడం చిరాకుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో రక్తం లేకపోవడం వల్ల కావచ్చు. స్రీలు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో, గర్భధారణ సమయంలో ,తల్లి పాలు ఇవ్వడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్ ,విటమిన్ బి12 వంటివి తక్కువగా ఉన్న ఆహార పదార్థాల వల్ల కూడా శరీరం రక్తహీనత సమస్యతో బాధపడతారు. రక్తహీనత సమస్య అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఐరన్, పోలిక్ యాసిడ్ వంటి మందులను తీసుకోవడం వైద్యులు సలహా ఇస్తారు. అయితే సహజ మార్గంలో కూడా కొన్ని ఆహార పదార్థాల ద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. రక్తహీనత సమస్య ఉన్నవారు వారం రోజులపాటు దానిమ్మ పండును తిన్నట్లయితే ఐరన్ సమస్య తగ్గుతుంది.
రక్తహీనత అంటే ఏమిటి- రక్తహీనత అంటే శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గే పరిస్థితి రక్తహీనత ఉన్నప్పుడు అలసట, హృదయ స్పందన రేటు పెరగడము, చర్మంలో మార్పులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి కనిపిస్తాయి. అంతేకాకుండా త్వరగా అలసిపోవడం, బలహీనం పడడం ,చర్మం తెలుపు రంగులోకి మారడం, చర్మం పొడి , దురద పెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరుగుతున్నట్లుగా అనిపించడం, కాళ్లు చేతులు చల్లగా అవ్వడం, కండరాలు, నరాల బలహీనత, ఆకలి లేకపోవడం, రుచి తెలియకపోవడం ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినట్లయితే మీకు రక్తహీనత సమస్య ఉన్నట్టుగా సంకేతం.
Health Tips: అశ్వగంధ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
రక్తహీనతకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి- రక్తహీనతకు అధిగమించడంలో మన ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయినా అధికంగా ఉండే ఆహార పదార్థాలు రక్తం ఏర్పడడానికి సహాయ పడతాయి. ముఖ్యంగా పాలకూర, బచ్చల కూర లో ఐరన్ అధికంగా ఉంటుంది. నువ్వులు, గుమ్మడి గింజలు ,పుచ్చకాయ గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, బాదంపప్పు, అవిస గింజలు శరీరంలో హిమోగ్లోవిస్తాయని పెంచుతాయి. బెల్లం లో కూడా అధికంగా ఉంటుంది. పాలు గుడ్లు, మాంసం, చేపలు, సోయాబీన్, ఆకుకూరల్లో రక్తహీనత సమస్యను తొలగిస్తాయి.
ఇటువంటి ఆహార పదార్థాలు తినకూడదు- రక్తహీనత సమస్యతో బాధపడేవారు పాలు తాగడం మానుకోవాలి. అంతేకాకుండా కాఫీ, బ్లాక్ టీ వంటివి తగ్గించాలి..
రక్తం తక్కువగా ఉన్నవారు రక్తాన్ని పెంచుకోవడం కోసం డ్రై ఫ్రూట్స్, తోపు, ఖర్జూరము అత్తిపండ్లు, వంటివి తీసుకోవాలి.
దానిమ్మ పండు- రక్తాన్ని పెంచడంలో దానిమ్మ అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది. దానిమ్మలో ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలు పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ సి సోషల్ లో సహాయపడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి