source: pixabay

ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుదల కనిపిస్తుంది. ముఖ్యంగా చదువుల విషయంలో వారు కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దీన్ని తగ్గించడం కోసం ఉదయాన్నే బ్రహ్మీ ఆకులను నమలడం ద్వారా మీ మెదడు చాలా పదునుగా మారుతుంది. క్రమం తప్పకుండా బ్రహ్మీ ఆకులను తినడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఏకాగ్రత జ్ఞాపకశక్తి వంటి సామర్థ్యాన్ని పెంచుతుంది.

బ్రహ్మీ ఆకులను తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు..

మెదడు పనితీరు మెరుగు పడుతుంది- బ్రహ్మీ ఆకులను ఖాళీ కడుపుతో ఉదయాన్నే తిన్నట్లయితే మీ మెదడు సామర్థ్యం పెరుగుతుంది. ప్రతిరోజు దీన్ని తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరుగుతాయి. చదువుల్లో ,మీరు పనిలో మెరుగైన పనితీరును కనిపిస్తారు.

ఒత్తిడి తగ్గుతుంది- బ్రహ్మీ ఆకులను ప్రతిరోజు నమలడం ద్వారా మెదడులోని పార్టీ సాలనే హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఇది స్ట్రెస్ ను కలిగించే హార్మోన్ ఇది మానసిక ఒత్తిడిని ,ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది.

నిద్ర లేముని తగ్గిస్తుంది- ప్రతిరోజు బ్రహ్మీ ఆకులను తినడం ద్వారా నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడే వారికి ఇది చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. దీన్ని తీసుకోవడం ద్వారా మీకు ప్రశాంతమైన ఘాడమైన నిద్ర వస్తుంది..

ఏకాగ్రత పెరుగుతుంది- బ్రహ్మీ ఆకులు ప్రతిరోజు తినడం ద్వారా మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లను పనితీరును సక్రమంగా చేస్తుంది. దీనివల్ల ఏకాగ్రత దృష్టి పెరుగుతుంది విద్యార్థుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. మానసికంగా కూడా వ్యక్తులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

బిపిని తగ్గిస్తుంది- బ్రహ్మీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. దీంతోపాటు రక్తపోటుతో బాధపడేవారు వీటిని తీసుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా.

బ్రహ్మీ ఆకులను ఎలా ఉపయోగించాలి..

ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపులతో తాజా బ్రహ్మీ ఆకులను నమలడం ఉత్తమం. సుమారు మూడు నుండి ఐదు ఆకులను నమ్మితే సరిపోతుంది.

బ్రహ్మీ ఆకుల రసం- మార్కెట్లో బ్రహ్మీ ఆకుల రసం దొరుకుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకటి నుంచి రెండు చాలా బ్రహ్మిరసం తాగడం ద్వారా మీ మెదడు పనితీరు పెరుగుతుంది. దీనికి తేనే నిమ్మరసం కూడా కలుపుకొని వాడుకోవచ్చు.

బ్రహ్మీ క్యాప్సూల్స్- ఈ మధ్యకాలంలో మార్కెట్లో బ్రహ్మీ క్యాప్సిల్స్ లేదా టాబ్లెట్స్ కూడా లభిస్తున్నాయి. మీకు ఆకులు దొరకని సమయంలో వీటిని తీసుకొని వాడుకోవచ్చు. అయితే మీరు డాక్టర్ సలహా మేరకు వీటిని వాడితే ఉత్తమం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి