తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాకుండా తేనె మన ఆరోగ్యం పైన అనేక రకాల సానుకూల ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తేనెను తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని చాలామందికి తెలియదు. తేనెలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో దాని కలయికను కూడా అంతే విధంగా చూసుకోవాలి. లేకపోతే దీనివల్ల అనారోగ్యానికి చాలా హానికరం జరిగేటువంటి కారణాలు ఉన్నాయి. అయితే తేనెను ఏ హార పదార్థాలతో కలిపి తీసుకోకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేడి నీరు- చాలామంది తేనెను వేడి నీటితో కలిపి తాగుతూ ఉంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం తేనె తేనెను వేడి నీటితో కలిపి తీసుకోవడం వల్ల దాని ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీనివల్ల మన శరీరం విషపూరితంగా మారుతుంది. కాబట్టి మీరు తేనె తీసుకోవాలనుకుంటే గోరువెచ్చటి నీటిలో లేదా చల్లటి నీటిలో కలిపి తీసుకోవడం ఉత్తమం. ఎక్కువ వేడి నీరుతో తేనెను కలిపి తీసుకోవడం వల్ల ఇది మన జీర్ణ క్రియను దెబ్బతీస్తుంది.
నెయ్యి- నెయ్యి నెయ్యితో చేసిన స్వీట్లతో తేనెను కలిపి తీసుకోవడం అనేది చాలా ఆరోగ్యానికి హానికరం దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో కొన్ని టాక్సిన్స్ విడుదలవుతాయి ఇది ఒక్కోసారి తీవ్ర ప్రమాదాన్ని కలగచేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెయ్యిని నేతితో చేసిన వంటకాలతో తేనెను అసలు కలపకూడదు.
Health Tips: పీరియడ్స్ సమయంలో తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారా ...
స్పైసీ ఫుడ్స్- తేనెను స్పైసీగా ఉన్న ఆహార పదార్థాలతో కలిపి అస్సలు తీసుకోకూడదు ఈ రెండిటి కలయిక వెళ్ళేది మన ఆరోగ్యానికి చాలా హానికరం ఒక్కొక్కసారి ఇది తీవ్రవాంతులను విరోచనాలను కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పైసీ ఫుడ్ తేనె రెండు కలిపి తీసుకోకూడదు..
టి.. టీ తో ఎట్టి పరిస్థితుల్లో తేనెను కలిపి తీసుకోకూడదు. పాలలో ,తేనెలో ఉష్ణోగ్రత వాటి యొక్క పీహెచ్ లెవెల్స్ భిన్నంగా ఉంటాయి. ఇవి రెండు కలిసి మన శరీరంలో కలిస్తే మన శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. ఇది అంత మంచిది కాదు.
నాన్ వెజ్ ఆహారాలతో- అటిక వేడి చేసే ఆహార పదార్థాలతో ,గుడ్లు, నాన్ వెజ్ చికెన్ వంటి ఆహార పదార్థాలతో తినను అసలు కలిపి తీసుకోకూడదు. దీని వల్ల మన శరీరంలో వేడి అమౌంట్ పెరుగుతుంది. మన శరీరంలో జీర్ణ సమస్యలు ఏర్పడితే అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా వాంతులు విరోచనాలు వంటి సమస్యలు పెరుగుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి