![](https://test1.latestly.com/uploads/images/2024/11/hairfall.jpg?width=380&height=214)
Health Tips: జుట్టు రాలడమనేది సాధారణ సమస్య అయినప్పటికీ కొన్నిసార్లు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అదే పనిగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే కొన్ని హార్మోనల్ ఇంబాలన్సు సమస్యలు కావచ్చు. కొన్ని రకాల హార్మోన్లో ప్రభావితం వల్ల జుట్టు అధికంగా రాలిపోతుంది. అయితే అవి ఏ హార్మోన్ల వల్ల జుట్టు రాలే సమస్య ఏర్పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
థైరాయిడ్ హార్మోన్- థైరాయిడ్ హార్మోన్ లో హెచ్చుతగ్గులు ఉండడం వల్ల అది జుట్టు పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ పనితీరును ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ .. ఈ రెండు హార్మోన్లు గర్భధారణ సమస్యల్లో కొంచెం హెచ్చుతగ్గుల్లో ఉంటాయి. అయితే ఈ సమయంలో జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది.
ఈ రెండు హార్మోన్లను చెక్ చేయించుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు..
Health Tips: చిలకడదుంప లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా
ఒత్తిడి.. వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మన శరీరంలో అనేక రకాల చెడు హార్మోన్లు విడుదల అవుతూ ఉంటాయి. ఇవి జుట్టు పైన ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వీటి కోసం మీరు ఎల్లప్పుడూ ప్రాణాయామం యోగ వంటివి చేసినట్లయితే ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. దీని ద్వారా ఒత్తిడి హార్మోన్ల రిలీజ్ తగ్గుతుంది. దీనివల్ల జుట్టు రాలే ప్రమాదం తగ్గుతుంది..
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి