ప్రతి మనిషికి వారి వారి పనులను బట్టి వారికి క్యాలరీలో అవసరం ఉంటాయి. అయితే వీటి ద్వారానే మనకు పోషకాహారం లభిస్తుంది. ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం అంత మంచిది కాదు. అధిక కేలరీలు తీసుకోవడం బరువు పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది. అయితే మనం తీసుకునే ఆహారాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. మనం చేసే పనిని బట్టి మనకు రోజు ఎన్ని క్యాలరీలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
క్యాలరీల ఉపయోగం- మన శరీరానికి క్యాలరీలు చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారాల్లో నుండి క్యాలరీలు ఉత్పత్తి అవుతాయి. అయితే మనం ప్రతిరోజు పని చేయడానికి శరీరానికి మనకు క్యాలరీలు ఉపయోగపడతాయి. తగినంత క్యాలరీలు తీసుకోకపోవడం వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండే, కాలయం, మూత్రపిండల్లో అనేక అవయవాలకు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
ఒక రోజుకు ఎన్ని క్యాలరీలు అవసరం- ఒక వ్యక్తి తాను చేసే శ్రమ పైన క్యాలరీలు తీసుకునే సంఖ్య ఆధారపడి ఉంటుంది.అయితే తక్కువ శ్రమ చేసే పురుషుల్లో 2000 క్యాలరీలు తీసుకోవడం మంచిది. అదే విధంగా స్త్రీలకు 1400 నుండి 1500 క్యాలరీలు అవసరం ఉంటాయి. ఒకవేళ వీటి కంటే ఎక్కువగా మీరు క్యాలరీలు తీసుకున్నట్లయితే బరువు పెరుగుతారు.
Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.
అధిక కేలరీల వల్ల కలిగే నష్టాలు- మన శరీరక అవసరాలకు మించి ఎక్కువ క్యాలరీలు తీసుకున్నప్పుడు మనము అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా శరీరంలో క్యాలరీలు పెరగడం వల్ల బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల మధుమేహము, కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతాయి, దీని ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మనం చేసే పనిని బట్టి మనకు ఎన్ని క్యాలరీల అవసరము అన్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం.
క్యాలరీలను ఎలా తగ్గించాలి- ఒకవేళ మీరు అధిక క్యాలరీలు తీసుకున్నట్లయితే వాటిని తగ్గించుకోవడం కోసం కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలి. ప్రతిరోజు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మీరు తీసుకునే ఆహారాలలో ఎక్కువ లిక్విడ్స్ ఉండేలాగా చూసుకున్నట్లయితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి