Amla Murabba (Photo Credits: Wikimedia Commons)

ఉసిరికాయలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఈ చలి కాలంలో ఎక్కువగా లభ్యం అయ్యే వీటిలో సీ విటమిన్‌ అధికంగా ఉంటుంది.ఐతే ఈ ఉసిరికాయను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయను తినడం కన్నా జ్యూస్ రూపంలో తీసుకోవడం చాలా మంచిది. ఇలా తీసుకోవడం అనేక రకాలైన ప్రయోజనాలు శరీరానికి అందుతాయని మీకు తెలుసా.. అవేంటో తెలుసుకుందామా..

ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సిట్రస్ పండ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఉసిరిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లు ఉండడం వలన ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది 

ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగడం వలన జీవక్రియను మెరుగుపరుస్తుంది. మెటబాలిక్ యాక్టివిటీ సరిగా ఉంటుంది. అంతే కాకుండా పోషకాలను కావల్సినంతా అందజేస్తుంది. ఆమ్లా జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన టాక్సిన్స్ బయటకు పంపి ప్రేగులను శుభ్రపరచడంలో దోహదపడతాయి.

ఉసిరి ఆమ్లా జీర్ణ ఎంజైమ్ల స్రావాన్ని ప్రోత్సాహించడంలో సహాయపడుతుంది. దీంతో ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.