మన శరీరంలో ప్రధానంగా మూడు దోషాలు ఉంటాయి. వాత ,పిత్త ,కఫ దోషాలు. వీటిలో పిత్త దోషం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏ సీజన్లోనైనా రావచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో చలికాలంలో ఈ సమస్య మరింతగా ఇబ్బంది పెడుతుంది. మన శరీరం పిత్తా దోషాన్ని కలిగి ఉన్నప్పుడు మనకు అధిక వేడి చెమటలు చిరాకు అనేక రకాల లక్షణాలను కలిగిస్తుంది. వీటిని తగ్గించుకోవడం కోసం మనము కొన్ని చిట్కాలు పాటించినట్లయితే ఈ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.
నీరు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి- మీ శరీరంలో వేడి తగ్గాలంటే ముందుగా మీ శరీరాన్ని ఎప్పుడు కూడా హైడ్రేటింగా ఉంచుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, దోసకాయ, పెరుగు వంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే మీ శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తీసుకోవడం ద్వారా పిత్త దోషం నుండి బయటపడవచ్చు.
Health Tips: ముల్లంగి ప్రతిరోజు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...
ఉసిరికాయ- ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఉసిరికాయను జ్యూస్ రూపంలో చేసుకొని రసాన్ని తీసుకున్నట్లయితే ఇది మీ శరీరంలో ఉన్న అధిక వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.
సోంపు- సోంపు తీసుకోవడం వల్ల కూడా అధిక వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఒక టీ స్పూన్ సోంపు గింజలను రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగినట్లయితే మీ శరీరంలోని అధిక వేడి తగ్గుతుంది.
మెడిటేషన్, ప్రాణాయామం- క్రమం తప్పకుండా ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రజ్ఞాత పెరుగుతుంది. ఇది మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. వేడి నుంచి విమర్శమనాన్ని కలిగిస్తుంది. శరీరము వేడి తగ్గించడం వల్ల మనం ఆరోగ్యంగా మానసిక ఆరోగ్యంగా కూడా సానుకూల ప్రభావాలు ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి