pista

డ్రై ఫ్రూట్స్‌లో పిస్తాలను అందరూ ఇష్టపడతారు. కొంతమంది పిస్తా పప్పులను లెక్క చేయకుండా తింటు ఉంటారు. పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్ బి6, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పిస్తాలో లభిస్తాయి.పిస్తా తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. శరీర అలసటతో పాటు బలహీనత కూడా దూరమవుతుంది. కానీ కొంతమందికి పిస్తా పాయిజన్ లాంటిది. అనేక సమస్యలలో, వైద్యులు కూడా పిస్తా తినకూడదని సలహా ఇస్తారు.పిస్తా ఎవరు తినకూడదో తేలుసుకుందాం.

అలెర్జీ రోగి: పిస్తా యొక్క స్వభావం వేడిగా ఉంటుంది, కాబట్టి ఇది అలెర్జీ సమస్యలు ఉన్నవారు పిస్తాపప్పులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది.

కిడ్నీ రోగులు: మీకు కిడ్నీలో రాళ్లు ఉంటే పొరపాటున కూడా పిస్తా తినకండి. ఎందుకంటే ఇందులో ఆక్సలేట్ సమ్మేళనం ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను కలిగిస్తుంది. ఇప్పటికే సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు.

 అధిక బరువు : బరువు తగ్గాలనుకునే వారు పిస్తాలను తక్కువగా తినాలి. ఎందుకంటే పిస్తా కేలరీలను పెంచుతుంది.

జీర్ణ సమస్యలు: జీర్ణ సమస్యలు ఉన్నవారు పిస్తా తినకూడదు. ముఖ్యంగా వేసవిలో పిస్తాలను తక్కువగా తినండి. ఇది మీ కడుపులో మలబద్ధకం సమస్యను కలిగిస్తుంది.

తక్కువ వయస్సు పిల్లలు: చిన్న పిల్లలకు పిస్తాపప్పులు తినడం, నమలకుండా తినడం తెలియదు. దీంతో గొంతులో పిస్తా మొత్తం ఇరుక్కుపోయే సమస్య ఉంది.