liver

Health Tips: కాలేయంలో కొవ్వు పేరుకు పోవడానికి ఫ్యాటీ లివర్ అని అంటారు. ఈ మధ్యకాలంలో ఇది చాలా మందిలో కనిపిస్తుంది. అయితే దీనికి ప్రారంభంలోనే కొన్ని లక్షణాలు మన శరీరం చూపిస్తుంది. వాటిని గమనించినట్లయితే ప్రారంభ దశలోనే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెడ ,అండరామ్స్ లో నలుపు- మెడ భాగంలో ,అండర్ అమ్స్ లో నలుపు ఎక్కువగా ఉన్నప్పుడు అది ఫ్యాటీ లివర్ కి సంకేతంగా చెప్పవచ్చు, ఇంకొంతమందిలో కీళ్ల భాగంలో నల్లటి మచ్చలు కనిపిస్తాయి, ఇది కూడా ఫ్యాటీ లివర్ సమస్యకు సంకేతంగా చెప్పవచ్చు, దీనిని గుర్తించి మీరు వైద్యుని సంప్రదిస్తే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడతారు.

Health Tips: గర్భవతులు వంకాయ తినవచ్చా... తింటే ఏమవుతుంది...

కడుపులో నొప్పి- కొంతమందిలో తరచుగా కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, కడుపు బరువుగా ఉండడం, వంటి సమస్య తరచుగా కనిపిస్తుంది. అయితే ఇది రెగ్యులర్గా తరచుగా కనిపిస్తే ఒకసారి చెక్ చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది ఫ్యాటీ లివర్ కి సంకేతంగా చెప్పవచ్చు.

ముఖం, పాదాల్లో వాపు- ఫ్యాటీ లివర్ సమస్య వల్ల కొంతమందిలో ముఖంలో వాపు వస్తుంది. అంతేకాకుండా పాదాలలో చీల మండలాలలో కూడా వాపు ఏర్పడుతుంది. ఇటువంటి లక్షణాలు మీకు కనిపించినట్లయితే అది ఫ్యాటీ లివర్ సంకేతంగా చెప్పవచ్చు. ఈ సమస్యను మీరు పరిగణించి వెంటనే వైద్యుని సంప్రదిస్తే మంచిది.

చిట్కాలు- సమస్యతో బాధపడేవారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ కి ప్రాసెస్ కి దూరంగా ఉండాలి. వాటర్ అధికంగా తాగాలి. వ్యాయమం చేయడం ఉత్తమం. ప్రతిరోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు. తీసుకుని ఆహారంలో పోషకాహారాలు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్ లో తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. యూరిక్ యాసిడ్ని పెంచేటువంటి ఆహార పదార్థాలను కూడా తగ్గిస్తే మంచిది. మద్యపానం, ధూమపానం వంటి సమస్యలు కూడా ఫ్యాటీలి వరకు కారణమవుతాయి. వీటిని కూడా తగ్గించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి