Lancet says one in eight people globally is now obese (Photo Credit: Pixabay)

ఈరోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే ఇది ఒక సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది. ఇది వారి శరీర రూపాన్ని కాకుండా వారి ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది. షుగర్ ,థైరాయిడ్, గుండె జబ్బులు ,పిసిఒడి వంటి సమస్యల వల్ల కూడా సమస్యలను కూడా పెంచుతుంది. అయితే ఆకస్మికంగా బరువు పెరగడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని మందుల వల్ల- కొన్ని మందులు తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా బరువు పెరుగుతారు. ఉదాహరణకు గర్భనిరోధకం మాత్రలు,  మధుమేహ మందులు శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. ఇవి మన శరీరంలో ఉన్న కొవ్వును పెంచడానికి సహాయపడతాయి. మీరు ఏదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు అకస్మాత్తుగా బరువు పెరిగితే అది దాని సైడ్ ఎఫెక్ట్ గా భావించి డాక్టర్ సలహా తీసుకోండి.

హార్మోన్ ఇన్ బాలన్స్- కొన్నిసార్లు బరువు పెరగడానికి కారణం మన హార్మోన్ లో ఇన్ బాలన్స్ వల్ల కావచ్చు. జీవనశైలిలో మార్పు స్ట్రెస్ సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో ఉన్న హార్మోన్లు ప్రభావితం అవుతాయి. పార్టీ సాల్ థైరాయిడ్ వంటి హార్మోన్లు మన బరువును పెంచడానికి కారణమవుతాయి. మోనోపాజ్ ,గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పు వల్ల కూడా వేగంగా బరువు పెరుగుతారు.

Health Tips: విటమిన్ డి తో బాధపడుతున్నారా

ఆహారం- కొన్నిసార్లు మనం బరువు పెరగడానికి ఆహారం ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం ప్రాసెస్ ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అదనపు కేలరీల అంది మన శరీరంలో కొవ్వు పేరుకుపోయి తొందరగా బరువు పెరుగుతారు.

అనారోగ్యం- కొన్నిసార్లు కొన్ని వ్యాధుల వల్ల అకస్మాత్తుగా బరువు పెరుగుతారు. అయితే ఎటువంటి సంకేతాలు లేకుండా బరువు పెరగడానికి కారణం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు వైద్యున్ని సంప్రదించి వ్యాధి నిర్ధారించుకోవడానికి కొన్ని పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

ఒత్తిడి- కొంతమందిలో అధిక ఒత్తిడి కారణంగా శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్ తప్పుతుంది. దీని ద్వారా కాఠశాల అనే హార్మోను అధికంగా పెరుగుతుంది. ఇది మన బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఒత్తిడి వచ్చినప్పుడు శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులకు గురై వేగంగా బరువు పెరుగుతారు.

మీరు అకస్మాత్తుగా బరువు పెరగడం గమనించినట్లయితే వెంటనే మీరు వైద్యుని సలహాతో ఖచ్చితమైన కారణాన్ని కనుక్కోవాలి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.