Kidney

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో కనిపించే సమస్య కిడ్నీలో రాళ్లు కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు అది విపరీతమైన నొప్పిని కలగజేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు జ్వరం, వాంతులు, విరోచనాలు,కడుపులో విపరీతమైన నొప్పి, వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మన శరీరంలో కిడ్నీలో రాళ్లు పేరకపోవడానికి ప్రధానమైన కారణాలు మన జీవనశైలిలో మార్పులు అంతేకాకుండా సరైనటువంటి ఆహారాలు తీసుకోకపోవడం చెడు ఆహారపు అలవాట్లు మంచినీళ్లు అధికంగా తీసుకోకపోవడం శరీరానికి శ్రమ ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.

ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు మూత్రపిండాల రాలేరని పెంచుతాయి. ఆ ఆహారాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు- ఉప్పు లో సోడియం అధికంగా ఉంటుంది. ఉప్పును అధికంగా తీసుకునే వారిలో మామూలు వారితో పోలిస్తే మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే సమస్య పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆహారంలో తగినంత ఉప్పును మాత్రమే తీసుకోవాలి అలా కాకుండా ఎక్కువగా వాడడం ద్వారా కిడ్నీలో రాళ్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Health Tips: పాలతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహారాలను తీసుకోకూడదు ...

మాంసాహారం- మాంసాహారం తినేవారిలో మూత్రపిండాల రాళ్ల సమస్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా శరీరం బరువు పెరుగుతుంది. దీనివల్ల మూత్రపిండాల పనితీరులో ఇబ్బంది ఎదుర్కొంటారు. మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీనివల్ల మూత్రపిండాల రాళ్ల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మాంసాహారాన్ని తగినంత మోతాదులో మాత్రమే తీసుకుంటే మంచిది.

తక్కువ నీరు- నీరు తక్కువ తాగే వారిలో మూత్రపిండాల రాళ్ల ప్రమాదం అధికంగా ఉంటుంది. మీరు కనీసం రోజుల్లో 8 నుంచి 10 గ్లాసుల నీరు త్రాగడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి మూత్రపిండాల రాళ్ల సమస్యతో బాధపడేవారు నీరును అధికంగా తీసుకోవడం ద్వారా మూత్రం పిండాల్లో ఏర్పడిన చిన్న చిన్న రాళ్లు మూత్రంతో బయటికి వస్తాయి. కాబట్టి మీరును అధికంగా తీసుకోవడం మంచిది.

అంతేకాకుండా సిట్రస్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. వీటి ద్వారా మూత్రపిండాల రాళ్లు కరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా ఉలవచారు ఉలవలు తీసుకోవడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా వాకింగ్ చేయడం జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి