source:pixabay

Health Tips: చాలా మందిలో మూత్రపిండాల రాళ్ల సమస్యతో బాధపడుతుంటారు. ఇది చాలా నొప్పిని కలిగించే అంశంగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వీరు ఏ పని చేయలేరు. ఈ రాళ్ల వల్ల ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేసుకోవడం ఉత్తమం అయితే మూత్రపిండాల రాళ్ల సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి. ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు. అనే అంశాలను కూడా తెలుసుకుందాం. రాళ్ల సమస్య తగ్గించుకోవడం కోసం రెమెడీస్ ను పాటించినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఉలవచారు- కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి ఉలవలు చక్కటి ఔషధంగా చెప్పవచ్చు. ఉలవలను రెండు గంటల పాటు నానబెట్టి వాటిని ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఆ నీటిని తాగినట్లయితే కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. చిన్న సైజులో ఉన్న రాళ్లకు ఇది చక్కటి అద్భుత వరంగా చెప్పవచ్చు. మీకు తో పాటు నొప్పి మంట మూత్రంలో మంట వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆ ఉలవలను కూడా ఉడకపెట్టుకొని తిన్నట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్యలు తొలగిపోతాయి.

Health Tips: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

కొండపిండి ఆకు- కొండపిండి ఆకులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. ఈ కొండపిండి ఆకును పప్పు రూపంలో లేదా పచ్చడి రూపంలో చేసుకొని తిన్నట్లయితే రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా కడుపులో నొప్పి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

మంచినీరు- మంచినీరు అధికంగా తాగాలి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగితే చిన్న సైజులో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా బయటికి వస్తాయి. కాకుండా అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తుంది.

తినకూడని ఆహారాలు- మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా టమాటా పాలకూర కలిపి తీసుకోకూడదు. అదే విధంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. దోసకాయ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. వీరు ఉప్పును తగ్గించాలి వీటి వల్ల కూడా రాళ్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వీరు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామంతో పాటు ప్రతిరోజూ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అంతేకాకుండా నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను కూరగాయలను తీసుకోవాలి. మంచినీరు దాదాపు మూడు నుంచి నాలుగు లీటర్ల మంచినీరు తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్లు రావడం అనే సమస్య తొలగిపోతుంది.

Disclaimer:పైన పేర్కొన్న విషయం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీ ఆరోగ్య సమస్యల కోసం సమీపంలో సర్టిఫైడ్ మెడికల్ డాక్టర్లను సంప్రదించండి.